ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వ హయాంలోనే అగ్రీగోల్డ్ బాధితులకు కాస్తయినా న్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాలనూ నిలువునా ముంచిన అగ్రిగోల్డ్ సంస్థపై బుధవారం ఏపి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్యెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు,మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేశ్ పై సంచలన ఆరోపణలు చేశారు.
''మోసపోయిన వారిని అగ్రిగోల్డ్ బాధితులు అనే కంటే నారావారి బాధితులు అనడం మంచిది. అగ్రిగోల్డ్ ఆస్తుల కొట్టేయ్యలని మాజీ మంత్రి నారా లోకేష్ చూసారు. అందుకే గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు కనీస న్యాయం కూడా చేయడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ ఆస్తుల్లోని హాయ్ ల్యాండ్ పై చిన బాబు(లోకేశ్) కన్నేశారు.
read more నవరత్నాలన్నారు... ఒక్క రత్నమూ ప్రజలకు అందడంలేదే: బుద్దా వెంకన్న సెటైర్లు
చంద్రబాబు ప్రమాణ స్వీకారంనాడు చినబాబు వేసిన చిక్కుముడి ఇప్పటికి విప్పలేదు. అగ్రిగోల్డ్ సంస్థ ఇంకమ్ ట్యాక్స్ సంస్థకి 1000 కోట్లు చెల్లించాలి. అగ్రిగోల్డ్ సంస్థకి మొత్తం 16000 ఎకరాల భూమి ఉంది...ఒక్క రాజధాని ఏరియాల్లో 1600 ఎకరాల భూమి ఉంది.
తాము చేసిన అప్పులు తీర్చాలని అగ్రిగోల్డ్ ప్రయత్నం చేసిందని కానీ ఆ సంస్థ ఆస్తుల కొట్టెయ్యలని ఆనాటి మంత్రులందరూ ప్రయత్నం చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే ఆ సంస్థకు ప్రభుత్వ సహకారం అందకుండా చూశారన్నారు. వీరి చర్యలన వల్ల దాదాపు 400 మందికిపైగా అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు.'' అని ఎమ్మెల్యే రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు.
read more