పవన్=గాలిమాటలు, కళ్యాణం= పెళ్లి...: పవన్ పై అంబటి షాకింగ్ కామెంట్స్

By Arun Kumar PFirst Published Dec 5, 2019, 7:24 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసిపి ఎమ్మెుల్యే అంబటి రాంబాబు మరోసారి  ద్వజమెత్తారు. పవన్ కల్యాణ్ అన్న పేరుకు మరో అర్థాన్ని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తాడేపల్లి: రాజధాని అమరావతిపై ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సుదీర్ఘమైన ఉపన్యాసాలిచ్చి ఏదో జరిగిపోతుందని ప్రజల్లో అపోహలు సృష్టించడానికి టిడిపి నాయకులు ప్రయత్నించారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అసత్యపు ఆరోపణలతో జగన్‌ ప్రభత్వంపై బురదజల్లే ప్రయత్నాల్లో ఇదీ ఒక భాగమేనని అన్నారు. 

అమరావతి పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని...కేవలం తాత్కాలికమైన నాలుగు భవనాలు కట్టి బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నానని మభ్యపుచ్చారన్నారు.తనకు, తన బినామిలకు అన్యాయం జరిగిపోతుందనే భయంతోనే ఇటీవవల రాజధాని పర్యటన, నేడు రౌండ్‌ టేబుల్స్‌ సమావేశాలు పెట్టారని ఆరోపించారు. 

నిరుపేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పధకంపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పేదప్రజల కోసమే పక్కరాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ  అమలుచేస్తున్నామని... దీన్ని పక్కరాష్ట్రాలో వర్తింపచేస్తే ఆదాయం పోతుందని అనడం విడ్డూరంగా వుందన్నారు. సీఎం జగన్‌ ఆదాయం గురించి చూడట్లేదని కేవలం ప్రజల ఆరోగ్యమే ఆయనకు ప్రధానమన్నారు. 

read more  గతంలో రాళ్లు, చెప్పులు.... ఈసారి మరేమిటోనని చంద్రబాబు భయపడే...: శ్రీదేవి

రాజధాని ప్రాంతంలో ప్రజలు టిడిపిని చిత్తుచిత్తుగా ఓడించినా ఇంకా బుధ్దిరాలేదని విమర్శించారు.  పవన్‌ కల్యాణ్‌  ఇంకా చంద్రబాబు దత్తపుత్రుడులాగానే మాట్లాడుతున్నారని... ఆ పేరుకు అతడు సరిగ్గా సరిపోయాడన్నారు. ఎవరు పెట్టారో కానీ ఆ పేరుకు పవన్ న్యాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

తన పేరులోని మొదటిమాట పవనం, చివరి మాట కల్యాణంకు ఆయన ఎప్పుడో న్యాయం చేశాడన్నారు. పవనం అంటే గాలిమాటలు చెప్పడమని అన్నారు. జగన్‌ ను ముఖ్యమంత్రిగా పవన్‌ గుర్తించరంట... ఆయన గుర్తించకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌  151 సీట్లు గెలవడానికి, జగన్‌  ముఖ్యమంత్రి కావడానికి, తామంతా ఎమ్మెల్యేలం కావడానికి ఆయనే కారణమనడం విడ్డూరంగా వుందన్నారు. 

బిజేపి,టిడిపి,జనసేన కలసి పోటీ చేస్తే వైసిపి దిక్కేఉండదని పవన్ అంటున్నారని....  కలిసి పోటిచేస్తే ముగ్గుర్ని కట్టకట్టి మహాసముద్రంలో పడేసేవారని అన్నారు.  రైతులకు న్యాయం జరగకపోతే ఆయన ఊరుకోనని ఊగిపోతున్న పవన్ అదే ప్రజలు ఓడించారని గుర్తించాలని సూచించారు. పవన్‌ కల్యాణ్‌ ను ప్రజలు రెండుచోట్ల ఓడించినా మార్పు రాలేదని అంబటి అన్నారు. 

read more ప్రధాని మోదీని కలిసిన మాట నిజమే...కానీ...: గంటా శ్రీనివాస్

''మొన్న ఇసుక దొరక్కపోతే లాంగ్‌ మార్చ్‌ చేశారు. తర్వాత సమస్య తేల్చకపోతే రాజధానిలో నడుస్తానన్నాడు.నేడు రాయలసీమలో నడుస్తారంట. ఇసుకమార్చ్‌ లో కనీసం రెండు కిలోమీటర్లు కూడా నడవలేకపోయారు. రాయలసీమ నుంచి నడుస్తావా... నీతో అయ్యేపనేనా. రాయలసీమలో నడువు, రాజధానిలో నడువు లేదా రష్యాలో నడువు నేను నడుస్తాను నడుస్తాను అంటే వద్దనేవారెవ్వరు. నడిస్తే ఏమవుతుంది.ఏమీ కాదు'' అని అన్నారు. 

'' అదేమంటే పవన్ మతాన్ని గురించి మాట్లాడతారు. క్రిష్టియానిటిలో చాలా గొప్పదనం ఉందంటాడు. క్రిష్టియన్‌ స్కూల్‌ లో తాను చదువుకున్నానంటాడు. భార్య,పిల్లలు క్రిష్టియన్స్‌ అంటాడు. క్రిష్టియన్స్‌ చేసే మానవసేవ ఏమతం చేయలేదంటాడు. తిరిగి మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారని అంటారు. హిందూమతం చాలా గొప్పది అంటారు. ఈ కాంట్రావర్సియల్‌ మాకు అర్దం కాలేదు'' అని అంబటి అన్నారు.

''భారతదేశం సెక్యులర్‌ కంట్రీ... అన్ని కులాలు,మతాలు సహజీవనం చేస్తున్న దేశంలో మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం.  ప్రభుత్వాలు వేరు, మత ప్రభోధకులు వేరు. వారి దోవన వారు పోతుంటారు. ఎవరి ఇష్టానుసారంగా వారు మతాల గురించి వెళ్తుంటారు.  నేనడుగుతున్నాను, పవన్‌ కల్యాణ్‌ మీ భార్య పిల్లలు క్రిష్టియన్స్‌ అంటున్నారు కదా. హిందుత్వంపై నమ్మకం ఉందా, క్రిష్టియానిటిపై నమ్మకం ఉందా చెప్పండి? అది మాత్రం చెప్పరు.మీరు మాట్లాడే పద్దతి ఏమాత్రం బాగాలేదు'' అని అంబటి ప్రశ్నించారు. 

click me!