జగన్ తీసుకున్నది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం...: మంత్రి అనిల్

By Arun Kumar P  |  First Published Dec 13, 2019, 6:35 PM IST

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రతిపక్షం టిడిపి అవినీతిపై విరుచుకుపడ్డారు.  


అమరావతి: రాజకీయాలల్లో ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి తీసుకునే అతి కష్టమైన, ప్రమాకరమైన నిర్ణయం ఏంటంటే కరప్షన్‌ మీద ఉక్కుపాదం మోపటమేనని నీటి, పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో ధైర్యం,చిత్తశుద్ది, నిజాయితీ ఉండాలని... అవన్ని ఉన్నాయి కాబట్టే ముఖ్యమంత్రి జగన్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అన్నారు. భారతదేశంలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెప్షన్‌ అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నఏకైక వ్యక్తం జగనేనని మంత్రి ప్రశంసించారు. 

''ఈ రోజు భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద వ్యాధి, ఆర్ధిక ప్రగతిని నిరోధించేది కరెప్షన్‌. దీన్ని గుర్తించిన తమ ముఖ్యమంత్రి అధికారం చేపట్టడానికి ముందే, ప్రమాణ స్వీకారం రోజు ట్రాన్స్‌ఫరెంట్‌ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ పనిలో జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఉండాలన్నారు. ప్రతీ ఒక్కటి పారదర్శకంగా ఉండాలని ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు'' అని మంత్రి పేర్కొన్నారు.  

Latest Videos

undefined

''గత ప్రభుత్వంలో వేలాది కోట్ల పనుల్లో అవినీతి జరిగింది. ఏ పనైనా నాలుగు శాతం ఎక్సెస్‌ వేసుకుంటూ వెళ్లారు. దీన్ని గుర్తించే తాము రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాం... దీని ద్వారా ఇప్పటివరకూ దాదాపు రూ. 1400 కోట్లు ఆదా అయ్యాయి. 

పోలవరానికి సంబంధించి ఒక టన్నెల్‌లో మేక్స్‌ ఇన్‌ఫ్రా అనే కంపెనీ దాదాపు రూ.230 కోట్ల రూపాయలు వర్క్‌లోనే 50 కోట్ల రూపాయల వరకు రివర్స్‌ టెండరింగ్‌లో ఆదా చేయడం జరిగింది. అదే వర్క్‌ గతంలో 4 శాతం ఎక్సెస్‌తో రావడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పై రివర్స్‌ టెండరింగ్‌కు వెళితే దాదాపు 750 కోట్ల రూపాయలు మిగుల్చుకోవడం జరిగింది.

రూ.550 కోట్లకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కూడా రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.67 కోట్లు మిగిలాయి. ఇదే కాకుండా మా జిల్లాలో ఆల్తూరుపాడు రిజర్వాయర్‌కు రివర్స్‌టెండరింగ్‌ పిలిస్తే రూ.250 కోట్లు వర్క్, గతంలో 4శాతం ఎక్సెస్‌ అయిన వర్క్‌కు రివర్స్‌టెండ్‌రింగ్‌కు వెళ్లాం. దాదాపు 26శాతం లెస్‌ వేసి రూ.68 కోట్ల రూపాయలు ఆదా చేయడం జరిగింది'' అని వెల్లడించారు. 

read more చంద్రబాబు-మార్షల్స్ వివాదం... ఉద్యోగ సంఘాలపై అశోక్ బాబు ఫైర్

''నాలుగు హౌసింగ్‌ ప్రాజెక్టులకు రివర్స్‌టెండరింగ్‌ పిలిస్తే దాదాపు 700 కోట్ల రూపాయలకు 15–20 శాతం లెస్‌తో రూ.105 కోట్లు ఆదా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో 4 శాతానికి తగ్గకుండా ఎక్సెస్‌ కోట్‌ చేశారు. ఇలా వేల కోట్ల రూపాయలు అదనంగా కోట్‌ చేశారు.  

ఏదేతే పోలవరం టన్నెల్‌కు సంబంధించి గతంలో 4 శాతం తీసుకున్న  మేక్స్‌ ఇన్‌ఫ్రా ప్రస్తుతం 15శాతం లెస్‌కు తీసుకుంది. గత ప్రభుత్వం ఎవరికైతే 4 శాతం ఎక్సెస్‌కు కట్టబెట్టారో అవే కంపనీలు ఇప్పుడు 15 శాతం, 20 శాతం లెస్‌కు వేసే పరిస్ధితి ఉంది. కేవలం 5–6 వేల కోట్ల రూపాయల పనుల్లో దాదాపు 1400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మిగిల్చగలిగింది'' అని మంత్రి వెల్లడించారు.

''రూ.1400 కోట్ల రూపాయలు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మా ప్రభుత్వం మిగిల్చకపోయి ఉంటే ఆ డబ్బులు ఏ బాబు జేబులోకి పోయుండేవి అని ప్రశ్నిస్తున్నాను.కేవలం ఓ ఐదు మందికే ఈ 1400 కోట్లు మిగిలేవి.  కానీ ఈ 1400 కోట్లు రూపాయలు మా ముఖ్యమంత్రి ఎన్ని సంక్షేమ పధకాలకు ఉపయోగించగలుగుతున్నారు. ఈ 1400 కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చి ఉంటే దాదాపు 20 లక్షల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండి ఉండేవి. 

దాదాపు 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిఉంటే 20 లక్షల మంది రైతుల్లో వెలుగులు నింపవచ్చు.అవే డబ్బులతో అమ్మఒడి పథకం క్రింద 20 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చు.'' అని గత ప్రభుత్వ అవినీతి గురించి వివరించారు.

read more రాజధాని మార్పుపై క్లారిటీ... మంత్రి బొత్స లిఖితపూర్వక ప్రకటన

''ఒక్క నీరు చెట్టు పథకాన్నే తీసుకుంటే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. హౌసింగ్‌ వంటి  ఇతర పధకాల్లోనూ వేలకోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో దోచుకుంది.  ఏ పధకంలోనైనా దోచుకోవడమే గత ప్రభుత్వ లక్ష్యం. కానీ మా ముఖ్యమంత్రి అలా కాదు. కలెక్టర్లకు, ఎస్పీలకు మొదటి సమావేశంలోనే ఆదేశాలిచ్చారు. మంత్రులైనా, అధికారులెవరైనా కరెప్షన్‌కు చేస్తే సహించ కూడదని. 

గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ఫెన్షన్ కావాలన్నా, ఇళ్లు కావాలన్నా లంచమే.అందుకే లంచాలు లేకుండా చేయడం కోసం గ్రామ సెక్రటేరియట్‌లను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుంది. 

ఎవరైనా లంచం అడిగితే 14400 నంబరుకు ఫోన్‌ చేస్తే సదరు అధికారులు మీద వారి జిల్లాలకు సంబంధించిన ఏసీబీ అధికారుల ద్వారా 15 రోజుల్లోపే బాధితులకు న్యాయం చేయడం జరుగుతుంది. అవినీతికి వ్యతిరేకంగా సినిమాలు తీస్తే... అలాంటి పాలన వస్తుందా అని జనాలు ఎదురుచూస్తున్నారు. ఆ భగవంతుడు జగ్మోహన్‌ రెడ్డి రూపంలో అలాంటి ముఖ్యమంత్రిని పంపించాడు. 

జగనన్న ఎప్పుడూ అంటూ ఉంటారు దివంగత నేత అభివృద్ధి వైపు రెండడుగులు వేశారు... నేను నాలుగడుగులు వేస్తానని.. కానీ ఆయన నాలుగు కాదు వంద కాదు అభివృద్ధి వైపు లెక్కలేనన్ని అడుగులు వేశారు అని గర్వంగా చెపుతున్నాను'' అంటూ ముఖ్యమంత్రి జగన్ ను మంత్రి అనిల్ కుమార్ ఆకాశానికెత్తేశాడు. 

click me!