చంద్రబాబు-మార్షల్స్ వివాదం... ఉద్యోగ సంఘాలపై అశోక్ బాబు ఫైర్

By Arun Kumar P  |  First Published Dec 13, 2019, 5:51 PM IST

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై గురువారం మార్షల్స్, ఇవాళ ప్రభుత్వం వ్యవహరించిన తీరును టిడిపి ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ప్రభుత్వం సభను నిరంకుశకంగా నడుపుతోందని మండిపడ్డారు. 


అమరావతి: గురువారం అసెంబ్లీ ప్రారంభ సమయంలో చోటుచేసుకున్న సంఘటన ఇవాళ(శుక్రవారం) శాసన సభ, శాసన మండలిని కుదిపేసింది. ప్రతిపక్ష సభ్యులను మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకోవడంపై టిడిపి సభ్యులు తప్పపుబట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం టిడిపి నాయకులే మార్షల్స్ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ ఎదురుదాడికి దిగారు. ఇరుపక్షాల వాదోపవాదాలతో ఇవాళ సభ దద్దరిల్లింది. 

గురువారం, శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలపై టిడిపి ఎమ్మెల్సీలు స్పందించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ... అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనపై తమ వాదన వినటంలేదన్నారు. వాస్తవ దృశ్యాలు శాసన మండలి లో ప్రదర్శించాలని  డిమాండ్ చేస్తే కనీసం పట్టించుకోలేదని అన్నారు.

Latest Videos

చంద్రబాబు నో క్వశ్వన్ అంటే ప్రభుత్వం మార్పింగ్ చేసి బాష్టర్డ్ అనే పదంగా మార్చారని ఆరోపించారు. చంద్రబాబుపై వైసిపి సభ్యులు ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటాన్ని  ఖండిస్తున్నామని అన్నారు. మార్షల్ ను చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించవద్దని అశోక్ బాబు సూచించారు. 

read more రాజధాని మార్పుపై క్లారిటీ... మంత్రి బొత్స లిఖితపూర్వక ప్రకటన

మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ...అసెంబ్లీ మార్షల్ శాసన సభ్యులు లోనికి రాకుండా గేట్లు వేయవచ్చా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను సభకు హాజరు అవ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు. 

తమ వద్ద కూడా వీడియోలు ఉన్నాయని... ఆ వీడియోలు కూడా మండలిలో ప్రదర్శించాలని కోరారు. తమ దగ్గరున్న వీడియోలు కూడా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం భయపడి పారిపోతోందన్నారు. సభను అర్దాంతరంగా వాయిదాలు వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

read more  నేను జైల్లో చిప్పకూడు తినలేదు: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ... టిడిపి సభ్యులను మార్షల్స్ అడ్డుకోవటంపై మండలి చైర్మన్ సీరియస్ అయ్యారని గుర్తుచేశారు. సభలో మాట్లాడాల్సిన అంశాలపై మెటీరియల్ తీసుకెళ్లటానికి కూడా అనుమతించలేదన్నారు. 

నాలుగు రోజులుగా సభా ప్రాంగణంలో పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను నేరస్తులలా చూస్తున్నారని మండిపడ్డారు. క్రియేట్ చేసిన వీడియోలు ప్రదర్శించి తమ సభ్యుల ఇమేజ్ డామేజ్ చేయటానికి ప్రయత్నిస్తూ హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని... దీన్ని సహించేది లేదని హెచ్చరించారు. 


 

click me!