డబుల్ బెడ్రూమ్ పథకంపై కీలక నిర్ణయం... వారికోసమే: మంత్రి గంగుల

By Arun Kumar PFirst Published Dec 13, 2019, 4:55 PM IST
Highlights

మహిళల ఆత్మగౌరవం  కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తోందని... ప్రతి పథకంలో వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇలా డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలోనూ అదేవిదంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

కరీంనగర్: తెలంగాణరాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిమహిళా ఆత్మగౌరవంతో బ్రతకాలని, ఆడబిడ్డలు సంతోషమే ప్రభుత్వ లక్ష్యంగా  పాలన సాగిస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో  మహిళా, యాదవసంఘ భవనాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నియోజకవర్గంలోని గ్రామాలన్ని అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం పెరుగుతుందని అన్నారు.

 ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్ళిలకు కళ్యాణాలక్ష్మి పథకంపెట్టి 1,00,116 అందజేస్తున్నామని అన్నారు. చెక్కులు అందుకున్న మహిళలు సంతోషంతో  సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దీవెనలు అందజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. 

read more జగన్‌కు ధన్యవాదాలు, దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయండి: దిశ తండ్రి

ఆడబిడ్డల సంతోషమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతుకాలన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మహిళల పేరుమీద అందజేస్తున్నామని తెలిపారు.  బతుకమ్మ పండుగను ఆడబిడ్డల కట్నంగా చీరలు అందజేస్తున్నామని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ కనమల్ల విజయ, ఎంపిపి పిల్లి శ్రీలత, పిట్టల కరుణ, సర్పంచ్ మొగిలిమంజుల, ఎంపీటీసీ పట్టేం శారద, కోఆప్షన్ సభ్యులు సాబీర్ పాషా, ఎంపీటీసీ తిరుపతి నాయక్, నాయకులు పిట్టల రవీందర్, లక్ష్మీనారాయణ తదితరులుపాల్గొన్నారు. 

read more దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం కమిటీ సభ్యుల నేపథ్యం ఇదే...


 

click me!