ఛాన్స్ కొట్టేశారు: వైసీపీలో భారీగా నామినేటెడ్ పదవులు

By Arun Kumar P  |  First Published Dec 4, 2019, 7:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో భారీస్ధాయిలో పదవుల పందేరా మొదలయ్యింది. జగన్ ప్రభుత్వం తాజాగా భారీసంఖ్యలో ఖాళీగా వున్న నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.  


అమ‌రావ‌తి: ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆ పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ వేగాన్ని పెంచింది. ఈ మేరకు కొన్ని కార్పోరేషన్లతో పాటు అన్ని జిల్లాలకు స‌హ‌కార కేంద్ర‌బ్యాంకుల‌కు చైర్మ‌న్లను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవ‌ల ఏర్పాటుచేసిన మూడు కార్పొరేష‌న్ ల‌కు ప్రభుత్వం క‌మిటీలు నియ‌మించింది. కార్పొరేష‌న్ ల‌కు చైర్మ‌న్ ల‌తో పాటు అధికారుల‌తో కూడిన క‌మిటీల ఏర్పాటుచేసింది. మాల కార్పోరేషన్ చైర్మన్ గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పోరేషన్ చైర్మన్ గా కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పోరేషన్ చైర్మన్ గా వ‌ద్దాయ్ మధుసూధన్ రావు లను నియమించారు.

Latest Videos

undefined

read more ఆ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించండి...: కలెక్టర్లకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

ఇక పదమూడు జిల్లాల‌కు స‌హ‌కార కేంద్ర‌బ్యాంకుల‌కు చైర్మ‌న్ లు , పర్సన్ ఇన్ ఛార్జ్ లను కూడా జగన్ ప్రభుత్వం నియ‌మించింది. జిల్లాల వారిగా డిసిసిబి ఛైర్మన్ల వివరాలు ఈ విధంగా వున్నాయి. 

కృష్ణా జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావు,

శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా పాలవలస విక్రాంత్.

విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా మరిసర్ల తులసి,

విశాఖ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా యూ. సుకుమార్ వర్మ,

పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కావూరి శ్రీనివాస్,

నెల్లూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి,

చిత్తూర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా ఎం.రెడ్డమ్మ.

కర్నూల్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా మాధవరం రామి రెడ్డి.

వైస్సార్ కడప జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా తిరుప్పల్ రెడ్డి.

అనంతపురం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా బోయ వీరంజనేయులు.

ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా డాక్టర్ మాదాసి వెంకయ్య.

తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా అనంత ఉదయ భాస్కర్

గుంటూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా  రత్తంశెట్టి సీతారామాంజనేయులును నియామించారు. 

ఏపీలో డీసీఎంఎస్‌ (జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఛైర్మన్లతో పాటు ఒక్కో జిల్లాలో ఆరుగురు చొప్పున సభ్యులకు చోటు కల్పించింది.

డీసీఎంస్‌ పేరు          ఛైర్మన్‌
1.శ్రీకాకుళం           పిరియా సాయిరాజ్‌
2.విజయనగరం      శిరువూరు వెంకటరమణరాజు
3.విశాఖపట్నం      ముక్కాల మహాలక్ష్మి నాయుడు
4.తూర్పుగోదావరి   దున్న జనార్దనరావు
5.పశ్చిమగోదావరి    యడ్ల తాతాజీ
6.కృష్ణా                   ఉప్పాల రాంప్రసాద్‌
7.గుంటూరు            కె.హెనీ క్రిస్టినా
8.ప్రకాశం                ఆర్‌.రామనాథం బాబు
9.నెల్లూరు               వి.చలపతిరావు
10.కడప                 దండు గోపి
11.కర్నూలు           పి.పి.నాగిరెడ్డి
12.అనంతపురం    పి.చంద్రశేఖర్‌రెడ్డి
13.చిత్తూరు            సామకోటి సహదేవరెడ్డి

click me!