ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలి...లేదంటే మరో ఉద్యమం...: టిడిపి హెచ్చరిక

By Arun Kumar PFirst Published Dec 4, 2019, 6:42 PM IST
Highlights

ఇటీవల ఆర్టీసి చార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హుజురాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  

కరీంనగర్: ఇటీవల పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టిడిపి నాయకులు నిరసనకు దిగారు. హుజురాబాద్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని  అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన తెలుగు తమ్ముళ్లు ఆర్డీవో సూపరిండెంట్ సందీప్ గారికి వినతి పత్రం సమర్పించారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా ప్రజలపై చార్జీల రూపంలో అదనపు భారం మోపి సామాన్య ప్రజల నడ్డి విరిచిందన్నారు. కిలోమీటర్ కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచి ఎనలేని భారాన్ని మోపిందన్నారు. ప్రభుత్వ చర్యలతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

read more  దిశపై అనుచిత వ్యాఖ్యలు: గుంటూరు యువకుడు అరెస్ట్, హైదరాబాద్‌కు తరలింపు

కొత్తగా పెంచిన ఆర్టీసీ చార్జీలతో ప్రజలపై సుమారు 900 కోట్ల భారం పడనుందన్నారు. సామాన్య ప్రజలపై భారం వేయడం సరికాదని వెంటనే పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని కోరారు. లేదంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు హరీష్, కోశాధికారి ఎస్కే ఫయాజ్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు టేకుల శ్రావణ్, టిడిపి మండల అధ్యక్షులు గుడి నారాయణరెడ్డి, కార్యకర్తలు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కూరపాటి రామచంద్రం, హుస్సేన్ ఖాన్, కొయ్యడ శ్యామ్ ,మాసాడి లింగారావు,  షడమాకి బిక్షపతి, పూదరి రమేష్, పెండ్యాల రాజేష్ , హసన్ ,కామని వీరేశం, పంజాల మొగిలి, ముషం యాదగిరి , రొంటాల నవీన్, బాణాల సదానందం కాట్రపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

click me!