నాలుగు రోజుల క్రితం రత్నకుమార్ ఆ మహిళ వద్దకు వెళ్లాడు. ఆదివారం ఆమెను వెంట పెట్టుకుని పెనమాక చేరుకున్నాడు. ఈ విషయంపై రత్నకుమార్ దంపతుల మధ్య కొట్లాట జరిగింది. రోకలిబండతో రత్నకుమార్ (33)ను తలపై విచక్షణారహితంగా మోదింది. తల నుజ్జునుజ్జవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్త తనని కాదని మరో మహిళ పట్ల ఆకర్షితుడౌతున్నాడని ఆమె అనుమానించింది. ఈ విషయంలో భర్తతో పలు మార్లు వాదనకు కూడా దిగింది. అయినా భర్త తీరు మారలేదని భావించి.. కోపంతో ఊగిపోయింది. ఆవేశంలో భర్త తలను రోకలి బండతో మోది హత్య చేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... పెనమాక ఎస్సీకాలనీలో నివాసం ఉండే కుంచం రత్నకుమార్‌కు విజయవాడకు చెందిన సునీతతో 14 ఏళ్ళ క్రితం వివాహమైంది. రత్నకుమార్ పెయింటర్ పనులు చేస్తుంటాడు. వీరికి ఇద్దరు సంతానం. రత్నకుమార్ సమీప బంధువైన విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఓ మహిళ ఇటీవల వీరి ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేది. ఈమె విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో పని చేస్తుంది. కొంతకాలంగా భర్తతో ఆమెకు విభేదాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం రత్నకుమార్ ఆ మహిళ వద్దకు వెళ్లాడు. ఆదివారం ఆమెను వెంట పెట్టుకుని పెనమాక చేరుకున్నాడు. ఈ విషయంపై రత్నకుమార్ దంపతుల మధ్య కొట్లాట జరిగింది. రోకలిబండతో రత్నకుమార్ (33)ను తలపై విచక్షణారహితంగా మోదింది. తల నుజ్జునుజ్జవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
చేతికి, ఒంటిపై ఉన్న రక్తపు మరకలు కడుక్కొని హత్యకు ఉపయోగించిన రోకలిబండను దాచేసింది. అనంతరం కొడుకు, కూతురిని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీసులకు లొంగిపోయింది. తాడేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.