రోడ్డు ప్రమాదంలో వీడియో జర్నలిస్ట్‌ మృతి

Siva Kodati |  
Published : Sep 30, 2019, 04:44 PM IST
రోడ్డు ప్రమాదంలో వీడియో జర్నలిస్ట్‌ మృతి

సారాంశం

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 చానెల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్‌ ప్రాణాలు కోల్పోయారు.

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 చానెల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్‌ ప్రాణాలు కోల్పోయారు.

మురళి మృతి పట్ల రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి కుటుంబానికి పేర్ని నాని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ కూడా మురళి ప్రసాద్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం మురళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌