ఏడాదిలో నాలుగోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

By narsimha lodeFirst Published Sep 26, 2019, 12:46 PM IST
Highlights

ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తేశారు. 

కర్నూల్: కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.కృష్ణా నది పరివాహక ప్రాంతం, తుంగభద్రా నది పరివాహక ప్రాంతం లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు  శ్రీశైలం ప్రాజెక్టు లోకి చేరుతుంది.

ఒకే సంవత్సరంలో నాలుగవసారి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తూ పరుగులు పెట్టుకుంటూ బిరబిరా కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపుకు  ప్రవహిస్తోంది.

సంవత్సరం లో 4వ సారి నీటి విడుదల

ఒకే సంవత్సరంలో నాలుగవసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు. మొదటిగా మూడు గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి నీటిని విడుదల చేయగా... ప్రాజెక్టుల్లోకి వరద నీటి ప్రవాహం పెరగడంతో తర్వాత 5 క్రెస్ట్ గేట్లను ఎత్తి  వరదనీటి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

శ్రీశైలం డ్యామ్  5 క్రెస్టు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువనకు 83,811 క్యూసెక్కులు వరదనీటి నీ విడుదల చేసున్నారు.అటు జూరాల నుండి ఇటు సుంకేసుల జలాశయం నుండి 1,69,930 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది..

శ్రీశైలం కుడి ఎడమ గట్ల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువనకు 66,319 క్యూసెక్కుల  వరద నీరు విడుదల అవుతుంది....శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. 

ప్రస్తుతం 884.70 అడుగులు కొనసాగుతుంటే.... డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా..ప్రస్తుత సామర్థ్యం 213.8824 టీఎంసీలు.. గా కొనసాగుతుంది....మరొక రెండు రోజులు నీటి విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు  ఇరిగేషన్ అధికారులు.

click me!