పోలీసులూ జాగ్రత్త... మీకు శిక్ష తప్పదు: చంద్రబాబు హెచ్చరిక

By Arun Kumar P  |  First Published Dec 2, 2019, 4:40 PM IST

కర్నూల్ జిల్లాలో జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపి పోలీసులను గట్టిగా హెచ్చరించారు.  


కర్నూలు: తన ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని సీఎంను ఇప్పుడు చూస్తున్నానని టిడిపి     అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. 

ఎప్పటి మాదిరిగానే గవర్నమెంట్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు కూడా ఫర్నీచర్ ఇచ్చిందని... కానీ వైసిపి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి కేసులు పెట్టి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకున్నా కోడెలపై కేసులు పెడితే 43 వేల కోట్ల అవినీతి చేసిన జగన్ కు ఎన్ని శిక్షలు వేయాలని ప్రశ్నించారు. 

Latest Videos

undefined

ఎన్ని శిక్షలు పడినా కార్యకర్తలను కాపాడుకుంటా నని చంద్రబాబు అన్నారు. టిడిపి అధికారంలో వున్నపుడు తాను కూడా జగన్ మాదిరిగా ఆలోచించి ఉంటే వైసీపీ నాయకులు ఉండేవారా అని అన్నారు. వైసిపిది విధ్వంసక ప్రభుత్వంమని ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదన్నారు. 

JusticeForDisha: షాద్ నగర్ కు చంద్రబాబు... దిశా ఉదంతంపై మరోసారి సీరియస్ కామెంట్స్

అక్రమ కేసులు పెడితే చట్టపరంగా పోలీసులకు శిక్షతప్పదన్నారు. వారే అధికారంలో వుండి కూడా కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య కేసులను తేల్చలేకపోతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి నీతి నిజాయితీ నిబద్ధత గల పార్టీ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ఫాలో అవుతూనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఇసుక ధర ఎందుకు పెరిగిందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. భారతదేశంలోనే ఉచిత ఇసుక పాలసిని టిడిపి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కర్నూలు జిల్లాలో ఇసుక దొరకడం లేదు కానీ ఇక్కడి  ఇసుక మాఫియాల ద్వారా హైదరాబాద్, బెంగళూరుకు తరలిస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడానికి ప్రభుత్వం నూతన ఇసుక పాలసి ప్రవేశపెట్టిందని ఆరోపించారు. గోరుకల్లులో 8 టిఎంసిల నీరు నిల్వ ఉంచేలా పనులు చేశామని... అవుకు టన్నెల్ పూర్తి చేశామని తెలిపారు. పులివెందులకు నీళ్లు ఇచ్చి మాట నెలబెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే వేదవతి టెండర్లు పిలిచామన్నారు. ఇలా టిడిపి హయాంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని చంద్రబాబు  పేర్కొన్నారు. 

అమరావతి నిర్మాణం కాదు...ఆ పేరే జగన్ కు నచ్చడంలేదు: వర్ల రామయ్య

ఎవ్వరూ  ఊహించని విధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ను పూర్తి చేశామన్నారు. పోతిరెడ్డిపాడు పనులు కంప్లీట్ చేసి 40 వేల క్యూసెక్కులు తరలించామని... వైసీపీ ప్రభుత్వంల ప్రాజెక్టుల్లో పిడికెడు మట్టి కూడా తీయలేదన్నారు. వరదలు వచ్చినా చెరువులు నింపే చొరవ తీసుకోలేదన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ల కోసం గొడవలు పడకుండా చేశామని...కానీ అదే శ్రీశైలం నీటిని అధికంగా కిందకు తరలించి నా ఇల్లు ముంచాలని చూశారన్నారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీళ్లు బానకచెర్ల కు తరలిస్తేనే రాయలసీమ సస్య శామలం అవుతుందని పేర్కోన్నారు.

ఇటీవల హైదరాబాద్ లో దారుణ హత్యకు గురయిన దిశ ఘటనపై స్పందించిన చంద్రబాబు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని ప్రజలందరు కోరుతున్నట్లే ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు కూడా డిమాండ్ చేశారు. 

click me!