శబరిమల యాత్రలో విషాదం...విజయనగరం వాసి మృతి, 15మందికి గాయాలు

Published : Nov 29, 2019, 03:17 PM ISTUpdated : Nov 29, 2019, 03:28 PM IST
శబరిమల యాత్రలో విషాదం...విజయనగరం వాసి మృతి, 15మందికి గాయాలు

సారాంశం

 దేవదేవుడు అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల కు వెళ్లిన విజయనగరం జిల్లా వాసులు తమిళనాడులోని కంచి ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.  

విజయనగరం: తమిళనాడులోని కంచిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. 

శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వర రావు(25)గా గుర్తించారు. మిగిలిన వారు కూడా అదే గ్రామానికి చెందినవారిగా భావిస్తున్నారు.

 read more   నారా లోకేశ్ కుట్రలు... జగన్ భద్రతకు ముప్పు: పోలీసులకు వైసిపి నేత ఫిర్యాదు

అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికి గౌరీశ్వర్ ప్రాణాలను కాపాడలేకపోయారు.  

ఈ దుర్ఘటనలో పాంచాలి గ్రామంలో విషాదాన్ని నింపింది. ఒకే గ్రామానికి చెందిన వారు ఇలా ప్రమాదానికి గురవడంతో పాటు ఒకరు మృతిచెందడంతో బాధిత కుటుంబాలే కాదు గ్రామస్తులందరూ కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు. 

read more  రైతులు కాదు... చంద్రబాబుపై దాడిచేసింది పోలీసులే..: అచ్చెంనాయుడు

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఏపి పోలీసులు మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?