RTC Strike: హనుమకొండ ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి

Published : Nov 02, 2019, 01:31 PM ISTUpdated : Nov 02, 2019, 01:38 PM IST
RTC Strike: హనుమకొండ ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి

సారాంశం

గుండెపోటుతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన హనుమకొండ ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మరణించాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రవీందర్ తీవ్ర మనస్తాపానికి గురి కావడంతో గుండె పోటుకు గురయ్యాడు.

వరంగల్: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మరణించారు. హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ రవీందర్‌కు మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన మూడు రోజులుగా హైదరాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

శనివారం మృతి చెందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంధువులను సైతం లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Also Read: శవాలను ఎత్తుకుపోయే పోలీసులున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్.

ఆర్టీసీ కార్మికుల గుండెపోటు మరణాలు, ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. టీఎస్ ఆర్టీసీ సమ్మె శనివారానికి 29వ రోజుకు చేరుకుంది. గత నెల 5వ తేదీ నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే మరణాలు సంభవించాయి. 

కరీంనగర్ లో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ బాబు అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అంతిమ యాత్ర సందర్భంగా బిజెపి ఎంపీ బండి సంజయ్ మీద ఏసీపీ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...