బండి సంజయ్ పై ఏసీపీ దాడి: బిజెపి రాస్తారోకో, దిష్టిబొమ్మ దగ్ధం

By telugu team  |  First Published Nov 2, 2019, 12:58 PM IST

బిజెపి ఎంపీ బండి సంజయ్ మీద ఏసీపీ దాడికి నిరసనగా బిజెపి కార్యకర్తలు కరీంనగర్ జిల్లాలో నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ మీద దాడి చేసినందుకు కేసీఆర్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


కరీంనగర్: శుక్రవారం కరీంనగర్ లో పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ మీద ఏసీపీ దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం బిజెపి కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ శవయాత్ర చేశారు. ఆ తర్వాత దిష్టిబొమ్మను తగులబెట్టి గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటు సభ్యుడి మీద దాడి చేసిన ఏసీపీని తక్షణమే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఎంపీ బండి సంజయ్ కు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. 

Latest Videos

undefined

Also Read: శవాలను ఎత్తుకుపోయే పోలీసులున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

ఈ నిరసన, రాస్తారోకో కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత, పొన్నం శ్రీనివాస్, మండల ప్రధానకార్యదర్శి బండి ఆదిరెడ్డి, మండల పార్టీ శ్రేణులు పోలోజు సంతోష్, కొంకటి లక్ష్మణ్, మిడివెళ్ళి వెంకటయ్య పాల్గొన్నారు. 

శ్రీమూర్తి సతీష్, దేవునూరి రాజ్ కుమార్, మకుటం సంపత్, మాచమల్ల బుజ్జన్న,దుడ్డెల లక్ష్మీనారాయణ, కూరెల్ల కిషోర్, పన్యాల శ్రీధర్ రెడ్డి, శ్యామకూర చంద్రశేఖర్ రెడ్డి, వర్ణ సాయిచందర్ రెడ్డి, గట్టు ఎల్లయ్య, మల్లం శ్రీనివాస్, సిల్ల‌ సతీష్ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

Also Read: డ్రైవర్ బాబు అంతిమయాత్ర: బీజేపీ ఎంపీ సంజయ్‌పై చేయిచేసుకున్న ఏసీపీ, ఉద్రిక్తత

పెనుకుల శివకృష్ణ (అంబి), చిట్టెల స్వామి, బిక్షపతి, వంగ శ్రీనివాస్, ఉల్లెంగుల శ్రీకాంత్, కోనేటి అజయ్, గడ్డం నవీన్ రెడ్డి, పొన్నం శ్రీకాంత్, గుడుగుల ఆంజనేయులు, కంకటి శ్రీనివాస్, మామిడి రాహుల్, సంపత్ రెడ్డి, కొడుముంజ శ్రీనివాస్ తదితరులు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

click me!