ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. రెండు రాష్ట్రాల్లోనూ ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలను అధికార పార్టీలే దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలయింది. ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 26 న ఎన్నికలు జరగనున్నాయి. పక్కరాష్ట్రం తెలంగాణతో పాటు మొత్తం 17 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి.
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎంఏ ఖాన్, తోట సీతారామలక్ష్మి, టి. సుబ్బిరామిరెడ్డి, కేశవరావుల పదవీకాలం ముగియవడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్లు రాష్ట్ర విభజనకు ముందే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వీరి పదవీకాలం పూర్తవడంతో ప్రస్తుతం రాజ్యసభకు ఏపీ నుంచి ఎవరని పంపిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైసీపీకి సొంతంగా 151 మంది ఎంఎల్ఏల బలం వుంది కాబట్టి నాలుగు స్థానాలు ఆ పార్టీకే దక్కనున్నాయి.
undefined
వైసీపీలో రాజ్యసభకు రేసులో చాలామంది పేర్లు వినిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, గోకరాజు రంగరాజు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు కూడా వినిపిస్తోంది. ఇందుకోసం జగన్ నుండి పార్టీ ముఖ్య నాయకులను సంకేతాలు కూడా అందినట్లు సమాచారం.
read more ఆ కుటుంబాల కోసమే రాజధానిపై వైసిపి సర్కార్...: వడ్డే శోభనాద్రీశ్వరరావు
అయితే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ కోటాలో ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. మండలి రద్దుకు ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయడంతో వీరిద్దరు మంత్రి పదవులను కోల్పోయే అవకాశం వుంది కాబట్టి రాజ్యసభకు పంపిస్తారనే చర్చ మొదలయింది. వీరిద్దరిలో ఒకరిని మాత్రమే రాజ్యసభకు పంపితే మరో ముగ్గురికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం టీటిడి చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభకు రేసులో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన టిటిడి పదవిలో కొనసాగుతారా లేక రాజ్యసభకు వెళతారా అన్నది జగన్ నిర్ణయాన్ని బట్టి బయటపడుతుంది.
ఇక బీదా మస్తాన్ రావు, గోకరాజు రంగరాజు ఇటీవలే పార్టీలో వైసిపిలో చేరారు. వీరిలో ఎవరో ఒకరిని, కుదిరితే ఇద్దరిని రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైనార్టీ కోటాలో కూడా ఒకరికి చాన్స్ ఉండే అవకాశం ఉంది. వైసీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు మెహబూబ్ మైనారిటీ కోటాలో రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఎక్కవగా వుందని వైసిపి వర్గాల్లో చర్చ మొదలయ్యింది. అయితే ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
read more వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టులో విచారణ... ప్రభుత్వానికి ఆదేశాలు
పార్టీలో మొదటి నుంచి ఉండి కష్టపడే వారకి జగన్ అవకాశమిచ్చేలా కనిపిస్తున్నారు. ఈ పదవిని ఆశిస్తున్న ఆశావహులు ఇంకా చాలా మందే ఉన్నారు. అయితే జగన్ ఎవరిని రాజ్యసభకు పంపాలి అనే దానిపై ఒక క్లారిటీతో ఉన్నారని సమాచారం. ఆశావహులు ఎంత మంది ఉన్నా జగన్ మనసులో ఉన్న పేర్లకే అవకాశాలు దక్కుతాయని వైసిపి శ్రేణుల అభిప్రాయం.