గన్ మిస్ ఫైర్... పోలిస్ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

Arun Kumar P   | Asianet News
Published : Feb 22, 2020, 07:21 PM IST
గన్ మిస్ ఫైర్... పోలిస్ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

సారాంశం

ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డ విషాద సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆదిలాబాద్: తుపాకిని శభ్రం  చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో ఓ  కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదం సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాని పోలీస్‌స్టేషన్లో చోటుచేసుకుంది. 

తిర్యాని పోలీస్ స్టేషన్లో కిరణ్ కుమార్ కానిస్టేబుల్. అతడు రోజూ మాదిరిగానే ఇవాళ కూడా విధులకు హాజయ్యాడు. ఈ క్రమంలోనే స్టేషన్ లోని ఓ తుపాకీని శుభ్రం చేయడానికి పూసుకున్నాడు. ఈ క్రమంలో తుపాకీ మిస్ ఫైర్ అయి బుల్లెట్ నేరుగా కిరణ్ తలలోకి దూసుకెళ్లింది. 

read more  భార్య మేనమామను కారుతో ఢీకొట్టి, 2 కిమీ ఈడ్చుకెళ్లి చంపేశాడు

తీవ్ర రక్తస్రావమై కొనఊపిరితో కొట్టుకుంటున్న అతన్ని తోటి పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తిర్యాని ఎస్సై తెలిపారు. రోజంతా తమతో పాటు విధులు నిర్వహించిన కిరణ్ ఇలా అకస్మాత్తుగా మృతిచెందడం తీవ్ర బాధను కలిగిస్తోందని ఎస్సై అన్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?