సిఎం జగన్ ప్లెక్సీకి నంద్యాల ఎమ్మెల్యే పాలాభిషేకం

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 9:20 PM IST
Highlights

అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రి జగన్ పై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ ప్రశంసల వర్షం కురిపించాడు.  

కర్నూల్:  నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరింగింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితుల్లో 20వేల రూపాయలు లోపు డిపాజిట్లు వున్నవారిని ఆదుకోవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు మొదటి దశలో రూ.10వేల లోపు డిపాజిట్లున్నవారికి చెక్కులను అందిస్తోంది. ఈ సందర్భంగా నంద్యాల పరిధిలోని బాధితులకు చెక్కులను అందించే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ పాలాభిషేకం చేశారు. అలాగే తమ పక్షాన నిలబడినందుకు ఎమ్మెల్యేకు కూడా బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సిపి అగ్రిగోల్డ్ అధ్యక్షులు ఆర్షవర్ధన్ రెడ్డి, బాచం జగదీశ్వర రెడ్డి,  అగ్రిగోల్డ్ నంద్యాల అధ్యక్షులు బిసి వెంకటేశ్వర్లు, అగ్రిగోల్డ్ యూనియన్ అధ్యక్షుడు మనోహర్ రాజు సోమన్న పాల్గొన్నారు. 

ఈసందర్భంగా  కర్ర ఆర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... నంద్యాల పార్లమెంటు పరిధిలోని అగ్రిగోల్డ్ బాధితులను కలిసుకొని వారి సమస్యలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెప్పారని...ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. 

గత టిడిపి  ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసిందన్నారు. కానీ వైఎస్సార్సి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని ముఖ్యమంత్రి నిరూపించారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలబడి సహకరించిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డితో పాటు తమకు సహకరించిన మిగిలిన  శాసనసభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో ముందుడుగు వేసిన విషయం తెలిసిందే.  వారికిచ్చిన హామీని నెరవేర్చే ఉద్దేశంతో ఏకంగా రూ.269.99 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుండి అగ్రిగోల్డ్ బాధితులతో పాటు వైఎస్సార్‌సిపి నాయకులు జగన్ పోటోలతో సంబరాలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో ఇటీవలే వైఎస్సార్‌సిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణ రాజు ఆద్వర్యంలో నగర పార్టీ కార్యాలయం సంబరాలు జరుపుకున్నారు. మిగతా నాయకులు, కార్యకర్తలతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  

ఇటీవలే వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం సొంత ఆటోలు కలిగి ఉన్న డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. దీంతో అమలాపురంలో ది సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ కు చెందిన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నల్లవంతెన సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద వైఎస్ జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు పాల్గొన్నారు.  

 

click me!