వర్షాలతో పంటనష్టం... పొలాల్లోకి వెళ్లి రైతులకు భరోసానిచ్చిన వ్యవసాయమంత్రి

By Arun Kumar PFirst Published Oct 25, 2019, 3:51 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వరి పంట నీట మునిగింది. ఇలా తీవ్రంగా నష్టపోయిన రైతులను వ్యవసాయ మంత్రి కన్నబాబు స్వయంగా పరిశీలించారు.  

తూర్పు గోదావరి: ఇటీవల భారీగా కురిసిన వర్షాల వలన మునిగిన వరి పొలాలను రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులతో పరిశీలించారు. శుక్రవారం కరప మండలం వేములవాడ, వాకాడ గ్రామంల్లో నీట మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. వర్షపునీటితో పూర్తిగా మునకకు గురయిన పొలాలను స్వయంగా పరిశీలించిన  మంత్రి రైతులను ఓదార్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...కేవలం తూర్పు గోదావరి జిల్లాలోనే 42 మండలాలు 194 గ్రామాల్లో దాదాపు 13438 హెక్టార్ల భూములలో వరి పంటకు నష్టం జరిగిందనట్లు తెలిపారు.దీనివల్ల 12,655 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు. ఇక అపరాల పంటను కలిగిన 1068 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు తెలిపారు. 

read more టిడిపి ప్రభుత్వ సిట్ రిపోర్టును వైసిపి ఎందుకు బయటపెట్టడంలేదంటే...: సిపిఐ (ఎం)

ఇటీవల కురిసిన వర్షాలు వలన తూర్పుగోదావరి జిల్లా పైన ఎక్కువ ప్రభావం పడిందన్నారు. ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా తక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. కౌలు రైతులకు కూడ నష్టపరిహారం వచ్చేలా సహకారం అందించాల్సిన అవసరం వుందని...ఈ  విషయాన్ని ముఖ్య మంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి  ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

రైతు భరోసా పథకం గురించి మంత్రి వివరిస్తూ...ఓసి కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా చూస్తామన్నారు. అంతకుముందు  ఓ.సి కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించాలని కొందరు రైతులు వ్యవసాయశాఖమంత్రికి వినతి పత్రం ఇచ్చారు.

అన్నదాతలకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసాపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు మొదటినుండి రైతులంటే చిన్నచూపేనని...అందుకోసమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

read more ఏపిలో భారీ ఉద్యోగాల భర్తీ... సీఎం జగన్ ఆదేశం

గోదావరి నదిలో మునకకు గురయిన బోటును వెతికి, భయటకు తీసినా ధర్మాడి సత్యం కాకినాడ వాసి అవ్వడం గర్వంగా ఉందన్నారు. ఎంతో ఆదునిక పరిజ్ఞానం కల్గిన వారుకూడా బోటు తియ్యడం సాద్యంకాదంటే... సత్యం మాత్రం తానే స్వయంగా బోటును వెలికితీయడానికి ముందుకు వచ్చాడని ప్రశంసించారు. 

రాష్ట్రంలో ఏ సంఘటన జరిగిన దానికి జగన్ మోహన్ రెడ్డే కారణమని దుష్ప్రచారం చేయడం చంద్రబాబు కి పనిగా మారిందన్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడటం వలనే ఇసుక కోరత ఏర్పడిందన్నారు. త్వరలో ఇసుక అందుబాటులోకి తీసుకుని వచ్ఛి ఇసుక కోరత లేకుండా చూస్తామన్నారు.

click me!