అబద్దాల ప్యాక్టరీకి యజమాని తెలుగుదేశమే... వారు ప్రొడ్యూస్ చేసేదిదే: కన్నబాబు

By Arun Kumar P  |  First Published Dec 17, 2019, 3:16 PM IST

గత టిడిపి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట కొందరి జేబులు నింపే కార్యక్రమం చేసిందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. పాదయాత్ర సమయంలో దీన్ని గమనించిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెెలిపారు. 


అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక అబద్దాల ప్యాక్టరీ నడుపుతోందని వ్యవసాయ శాఖమత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఆ ప్యాక్టరీలో రోజుకొక అబద్దం ప్రొడ్యూస్‌ చేసి జనాలమీదకి వదులుతోందని... అలా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ మంత్రులకు అధికారం ఇచ్చారనే అబద్దాన్ని కూడా సొంతంగా తయారుచేసుకున్నారని మంత్రి ఆరోపించారు. 

టిడిపి సభ్యులు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని...వారి మాటల్లో ఏ మాత్రం నిజాయితీ ఉండదన్నారు. పాదయాత్ర చేస్తున్నసమయంలోనే జగన్మోహన్‌ రెడ్డి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్నారని... అప్పుడే వీటిని సరిచేయాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. దాని ఫలితంగానే ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీస్‌ ఏర్పడినట్లు తెలిపారు.

Latest Videos

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలపై ప్రతపక్ష టిడిపి అబద్దాలను ప్రచారం చేస్తోందని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ని రోడ్డు మీదకి వదిలేసింది ఎవరని మంత్రి ప్రశ్నించారు. అసలు ఈ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ని తీసుకురాడానికి కారణాలను మంత్రి వివరించారు.

read more  అది ఆయన పనే... లోకేశ్‌కు సవాల్ విసిరిన మంత్రి

గతంలో ప్రభుత్వం తరపున ఒక దళారీని పెట్టి కేవలం వారిద్వారానే ఎంప్లాయిస్‌ని పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదివేలో, ఇరవై వేలో ఇస్తుంటే వాడు(ఈ దళారి) ఎంప్లాయికి ఐదువేలో, ఆరు వేలో ఇచ్చి పనిచేయించుకునే కార్యక్రమం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు, చివరకు ఈపీఎఫ్, పీఎఫ్‌ కూడా లేదన్నారు. 

ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడమే కాదు నియామకాలను కూడా వీళ్లు అవినీతికి పాల్పడ్డారు.  భారీ అక్రమాలకు తెరతీసి వాళ్లకు ఇష్టమొచ్చిన వాళ్లవద్ద డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో జరిగిందన్నారు. ఇదే విషయం పాదయాత్ర సమయంలో జగన్ దృష్టికి  వచ్చినట్లు మంత్రి తెలిపారు. 

read more  ఇరిగేషన్ లోనే కాదు విద్యాశాఖలోనూ రివర్స్ టెండరింగ్... ప్రకటించిన జగన్ ప్రభుత్వం

దీంతో వీటిని సరిచేయాలని నిర్ణయం తీసుకుని ఇవాళ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌కి సంబంధించి, కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌కి సంబంధించి ఒక విధానాన్ని తీసుకురావడానికి ప్లాన్‌ చేశారని చెప్పారు. దాని ఫలితమే ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీస్‌ ఏర్పాటని మంత్రి కన్నబాబు సభలో సమాధానమిచ్చారు. 


 

click me!