తీరు మార్చుకో...లేదంటే రాజకీయాలకే పనికిరాకుండా పోతావ్..: పవన్ కు అవంతి హెచ్చరిక

By Arun Kumar P  |  First Published Nov 5, 2019, 4:36 PM IST

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని...ఇలా ఆవేశంగా మాట్లాడితే రాజకీయాలకు పనికిరాకుండా పోతారని హెచ్చరించారు.  


అమరావతి: ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడమంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని జనసేన అధ్యక్షులు పవన్ గుర్తించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.  ధర్మం జగన్ పక్షానే ఉందని అందుకే ఎన్నికల్లో నెగ్గారని అన్నారు. ప్రజల తీర్పుని పవన్ అవమనిస్తున్నారా...? అని మంత్రి ప్రశ్నించారు. పవన్ కు ఆవేశం ఉంటే రాజకీయాలకు పనికి రాడన్నారు.

 పార్టీ పెట్టింది మొదలు జగన్ ను తిడుతూనే వున్నారన్నారని గుర్తుచేశారు. ఆయనకు ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రి జగనేనని, చంద్రబాబు ఎంత ఇష్టం ఉన్నా ప్రతిపక్ష నేతేనని అన్నారు. జగన్ ను ఎంత విమర్శిస్తే పవన్ అంత నష్టపోతారని...చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని సూచించారు. పవన్ వ్యక్తిగత దూషణకు దిగడం మానుకోవాలని మంత్రి సూచించారు.  

Latest Videos

undefined

ఇక రాష్ట్రవ్యాప్తంగా యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నవంబర్ 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే నాడు-నేడు కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలల్లో వీటిని నిర్వహిస్తూనే యువజనోత్సవాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

read more  పాఠశాలలు, హాస్పిటల్స్ లో నాడు-నేడు... ఏం మారనున్నాయంటే...: జగన్

రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో నెలకు ఒక ఈవెంట్ చొప్పున ఆర్గనైజ్ చేయాలని  నిర్ణయించినట్లు తెలిపారు. మెగా ఈవెంట్ ను సీఎం చేతుల మీదుగా అమరావతి లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి  చెడు వ్యసనాలతో పాటు సెల్ ఫోన్ అడక్షన్ కు యువత గురవుతున్నారని... దీంతో చాలా రుగ్మతలు వస్తున్నాయన్నారు. వీటిని నివారించడానికి కౌన్సిలర్ ద్వారా  ప్రత్యేక క్లాస్ లు ఇప్పిస్తామన్నారు. అనుకోని సంఘటనలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందే అవి జరక్కుండా జాగ్రత్తపడటం మంచిదే కదా అని మంత్రి పేర్కొన్నారు. 

నేషనల్ ఇంటిగ్రేషన్ డే పేరుతో విశాఖలో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ నెలలో నెల్లూరు, వచ్చేనెలలో కాకినాడ, జనవరిలో కడపలో యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. 

read more నీ రహస్యాలన్నీ నాకూ తెలుసు... బయటపెట్టమంటావా...?: పవన్ కు బొత్స హెచ్చరిక

సమాజంలో మహిళలు ఇంకా వివక్ష కొనసాగుతోందని మంత్రి తెలిపారు. వారి శారీరక, మానసిక సమస్యలు పరిష్కారనికి కార్యక్రమాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆత్మరక్షణలో కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. మహిళల కోసం ప్రతి నెలా ఒక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

స్పోర్ట్ కాంప్లెక్స్ లకు కనీస సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామన్నారు. 25 శాతం పైగా పూర్తి అయినా స్టేడియం లు పూర్తి చేయాలని చెపుతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్స్ విధానం లో పనిచేస్తున్న కోచ్ ల సమస్యల పై సీఎం తో చర్చిస్తానని మంత్రి అవంతి హామీ ఇచ్చారు. 

click me!