డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై అసభ్య కామెంట్స్... ఆకతాయి అరెస్ట్

By Arun Kumar P  |  First Published Feb 22, 2020, 8:59 PM IST

ఏపి డిప్యూటీ సీఎం  పుష్పశ్రీవాణిపై అసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పాముల పుష్ప శ్రీవాణి పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం జూన్ లో పేస్ బుక్ లో వెంకటేశ్వర్ రావు పేరుతో డిప్యూటీ సీఎం పై అసభ్యకరమైన కామెంట్స్ పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవ్వడంలో పుష్ఫశ్రీవాణి దృష్టికి వెళ్లింది. 

దీంతో ఆమె అక్టోబర్ లో ఎల్విన్ పేట పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అప్పటినుండి పోలీసులు సాంకేతికత సాయంతో ఈ పోస్ట్ పెట్టిన నిందితుడి కోసం వెదుకుతున్న పట్టుకోలేకపోయారు. తాజాగా అతడు బెంగళూరులో వున్నట్లు గుర్తించిన పోలీసులు ఓ బృందాన్ని అక్కడికి పంపించి అరెస్ట్ చేశారు. 

Latest Videos

మంత్రి పుష్పశ్రీవాణి అసభ్యకర పోస్టింగ్ లు పెట్టిన వెంకటేశ్వర్లుది నెల్లూరు జిల్లా కావలిగా పోలీసులు గుర్తించారు. అయితే అతడికి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదనట్లుగా విచారణలో తేలిందని తెలిపారు. పార్వతీపురం ఏఎస్పి సుమిత్ గరుడ మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యవహానికి సంబంధించిన వివరాలను  వెల్లడించారు. 
 

click me!