భార్యపై అనుమానం... కన్న కొడుకునే కిరాతకంగా చంపిన కసాయి తండ్రి

By Arun Kumar P  |  First Published Nov 9, 2019, 7:23 PM IST

ప్రకాశం జిల్లాలో ఓ కసాయి వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యపై అనుమానంతో కన్న ప్రేమను మరిచి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు.  


ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది.  గుమ్మల్ల చిన్న పుల్లయ్య అనే వ్యక్తి భార్యపై అనుమానంతో 8 నెలల కన్నకొడుకు హేమంత్ కుమార్ ని నేలకేసి కొట్టి అతి దారుణంగా హతమార్చాడు. భార్యాభర్తల మధ్య  గొడవలో అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. 

పుల్లయ్య తన భార్యరమాదేవి భార్యపై అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. భార్యను కూడా కత్తితో గాయపర్చడమే కాకుండా రోకలి బండతో దారుణంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్యను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

నిందితుడు చిన్న పుల్లయ్యకు అర్ధవీడు మండలం మోహదిపురానికి చెందిన గుమ్మల్ల లక్ష్మీదేవితో గతంలో విహహం జరిగింది. ఆమెను కూడా ఇలాగే నిత్యం అనుమానిస్తూ వేదించిన అతడు ఒకరోజు ఏకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు.

read more  వదినతో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడని....

ఆ తర్వాత రమాదేవిని రెండు సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు.  ఈసారి  పుల్లయ్య భార్యపైన దాడి చేయడమే కాదు తన కన్న కొడుకుని అతి దారుణంగా చంపాడు. 

ఈ  ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా  స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని  పరిశీలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని...అతిత్వరలో అతన్ని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని సీఐ సుధాకర రావు వెల్లడించారు.

read more  tik tok: టిక్ టాక్ లో వీడియోలు... భార్యను చంపిన భర్త


 

click me!