మెట్రో స్టేషన్ లో యువతి మృతి... మార్చురీ వద్ద హై డ్రామా

By telugu teamFirst Published Sep 24, 2019, 8:06 AM IST
Highlights

మౌనిక బంధువుల ఆందోళనతో మార్చురీ వద్ద గందరగోళం నెలకొంది.  తర్వాత అధికారులు నచ్చచెప్పడంతో.... వారు తమ ఆందోళనను విరమించారు. సాయంత్రానికి పోస్టు మార్టం సజావుగా సాగింది. అయితే... ఎక్స్ గ్రేషియా మాత్రం ఇచ్చేదీ లేనిదీ అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా...  మౌనిక కుటుంబసభ్యులను ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు.
 

అమీర్ పేట మెట్రో స్టేషన్ లో జరిగిన ప్రమాదం కారణంగా మౌనిక అనే యువతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా... సోమవారం సాయంత్రం మౌనిక మృతదేహానికి ఫోరెన్సిక్ వైద్యులు పోస్టు మార్టం పూర్తి చేశారు. అయితే... పోస్టు మార్టానికి ముందు గాంధీ మార్చురీ వద్ద హైడ్రామా నడిచింది.

యువతి మృతదేహాన్ని గాంధీ మార్చురీ వద్దకు తీసుకురావడంతో... బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోస్టుమార్టం పూర్తికాగానే అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మృతదేహంతో వెళ్లి బేగంపేట మెట్రో భవన్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అక్కడే కూర్చొని రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే వరకూ పోస్టుమార్టానికి ఒప్పుకునేది లేదని ఆందోళన మొదలుపెట్టారు.

మౌనిక బంధువుల ఆందోళనతో మార్చురీ వద్ద గందరగోళం నెలకొంది.  తర్వాత అధికారులు నచ్చచెప్పడంతో.... వారు తమ ఆందోళనను విరమించారు. సాయంత్రానికి పోస్టు మార్టం సజావుగా సాగింది. అయితే... ఎక్స్ గ్రేషియా మాత్రం ఇచ్చేదీ లేనిదీ అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా...  మౌనిక కుటుంబసభ్యులను ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు.

కాగా... ఆదివారం సాయంత్రం మౌనిక అనే మహిళ.. మెట్రో స్టేషన్ లో నిలబడి ఉండగా... ఆమెపై మెట్రో పెచ్చులు ఊడిపడి ఆమె తీవ్రగాయాలపాలయ్యింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... తీవ్రగాయాలయ్యి అప్పటికే చనిపోయినట్లు అధికారులు చెప్పారు. సోదరితో పాటు సారథి స్టూడియోస్‌ సమీపానికి వచ్చిన ఆమె వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో అక్కడి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ మెట్ల కిందకు వెళ్లి ఆ ఇద్దరు నిల్చొన్నారు. అదే సమయంలో పెద్ద పెట్టున మెట్రో స్టేషన్‌ పై నుంచి పెచ్చులు ఊడిపడి ఆమెపై పడటంతో దుర్మరణం చెందింది.

ఒక్క అమీర్‌పేట సారథి స్టూడి యోస్‌ వద్ద అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లోనే కాదు.. మెట్రో దారి పొడుగునా వర్షం వస్తే వాహనచోద కులు, పాదచారులు ఆయా మెట్రో స్టేషన్‌ కిందకు పరుగులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం సారథి స్టూడియోస్‌ వద్ద అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో సంభవించిన ఘోరంపై ప్రజలు ఉలికిపాటుకు గుర య్యారు. తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ ఘటనపై మెట్రో నిర్మాణంపై ప్రజలు తీవ్ర అసహ నాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కాగా, మౌనికకు రెండు నెలల క్రితమే పెళ్లయింది. మౌనిక మృతి వార్తతో ఆ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా మెట్రో స్టేషన్‌నుంచి పెచ్చులు ఊడిపడటమేంటని ప్రజానీకం ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు.

read more news

రెండు నెలల క్రితమే పెళ్లి: మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి టెక్కీ మౌనిక దుర్మరణం

హైదరాబాద్ మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి లేడీ టెక్కీ మృతి (వీడియో)

యువతి ప్రాణం తీసిన మెట్రో స్టేషన్... స్పందించిన అధికారులు

మెట్రో స్టేషన్ లో మౌనిక మృతి... రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్

click me!