కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్: కర్నూలు ఎస్పీ ఫకీరప్ప కీలక సూచనలు

By Nagaraju penumalaFirst Published Oct 1, 2019, 5:39 PM IST
Highlights

అభ్యర్థులంతా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు అన్ని సర్టిఫికెట్లకు సంబంధించిన 2 సెట్ల జిరాక్సు కాపీలు మరియు 10 పాస్ పోర్టు సైజ్ కలర్ ఫోటోలను తీసుకురావాలని ఎస్పీ స్పష్టం చేశారు. అభ్యర్థులంతా వైద్యపరీక్షలకు కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు ఎస్పీ ఫకీరప్ప. 

కర్నూలు: కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 3,4న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరుకావాలని కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో కర్నూలు జిల్లా నుంచి 259 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. 

ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 3,4 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. జిల్లాలో కానిస్టేబుల్ దేహదారుడ్య మరియు రాత పరీక్సలకు హాజరై ఉత్తీర్ణత సాధించిన స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్, వార్డర్, ఫైర్ మెన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 

click me!