బీజేపీకి బీ టీమ్ టీఆర్ఎస్, లక్ష్మణ్ అతిగా ఊహించుకోకు : పొన్నం ప్రభాకర్

Published : Oct 01, 2019, 04:58 PM ISTUpdated : Oct 01, 2019, 09:11 PM IST
బీజేపీకి బీ టీమ్ టీఆర్ఎస్, లక్ష్మణ్ అతిగా ఊహించుకోకు : పొన్నం ప్రభాకర్

సారాంశం

రెండూ ఒకటి కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై సీబీఐతో విచారణ జరిపిస్తారా అంటూ సవాల్ విసిరారు. లేకపోతే బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. 

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ టీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ తోడు దొంగలేనని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రెండూ ఒకటి కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై సీబీఐతో విచారణ జరిపిస్తారా అంటూ సవాల్ విసిరారు. లేకపోతే బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. 

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై తెలంగాణ లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో లక్ష్మణ్‌ చెప్పాలని సవాల్ విసిరారు. 

తెలంగాణలో బీజేపీకి ఎక్కడా మూడు వేలకు మించి ఓట్లు రావన్నారు. డిపాజిట్ కూడా రాని పరిస్థితిలో బీజేపీ ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీ స్థానాలు గెలవగానే లక్ష్మణ్ అతిగా ఊహించుకుంటున్నారంటూ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
 
PREV
click me!

Recommended Stories

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం
దుబాయ్‌లో జైలు శిక్ష, విముక్తి: 18 ఏళ్లకు హైద్రాబాద్‌కు, భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు