త్వరలో న్యాయవాదులు తీపికబురు వింటారు: కర్నూలులో హైకోర్టుపై ఎంపీ సంజీవ్

By Siva KodatiFirst Published Oct 1, 2019, 5:26 PM IST
Highlights

రాజధాని విషయంపై తనకు స్పష్టత లేకున్నా...  హైకోర్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మాత్రం పూర్తి నమ్మకం ఉందన్నారు....వీలైనంత తొందరలో న్యాయవాదులు తీపి కబురు వింటారని వారికి భరోసా ఇచ్చారు

కర్నూలు జిల్లాకు పూర్వవైభవం తేవాలంటే అది జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని స్పష్టం చేశారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. కర్నూలు జిల్లాలో రాజధానితోపాటు హైకోర్టును మంజూరు చేయాలంటూ గత ఇరవై రోజుల నుంచి న్యాయవాదులు నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ... న్యాయవాదులు చేస్తున్న న్యాయమైన నా ఆందోళనకు తన మద్దతును తెలిపారు. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా వెలుగొందిన కర్నూలు జిల్లాకు రాజధానితో పాటు హైకోర్టును కోరడం లో న్యాయముందని ఎంపీ స్పష్టం చేశారు.

రాజధాని విషయంపై తనకు స్పష్టత లేకున్నా...హైకోర్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మాత్రం పూర్తి నమ్మకం ఉందన్నారు....వీలైనంత తొందరలో న్యాయవాదులు తీపి కబురు వింటారని వారికి భరోసా ఇచ్చారు.

తమ ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరిస్తూ చిత్తశుద్ధితో పని చేస్తుందని మాటల్లో కాకుండా చేతల్లో చూపించడమే ధ్యేయంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఎంపీ సంజీవ్ కుమార్ త్వరలోనే కర్నూలు హైకోర్టు వస్తుందని అదేవిధంగా రాయలసీమను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు
 

click me!