ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై కర్నూల్ ఎంపి సంజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు.
కర్నూల్: అభివృద్దిలో కర్నూలు చాలా వెనుకబడిందని... కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నా తాగునీటి సమస్య తాండవిస్తోందని వైసిపి ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. గత టిడిపి ప్రభుత్వం కర్నూలులో కనీసం తాగునీటి సమస్యనూ తీర్చలేకపోయిందని ఆరోపించారు. ఒక్క కర్నూలే కాదు రాయలసీమ అభివృద్దిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కృష్ణానది ద్వారా వేల టీఎంసీ నీరు దిగువకు వెళ్తున్నా కర్నూలు వద్ద కనీసం 1 టీఎంసీ నీరు దాచడానికి కూడా అవకాశం లేకుండా చేశారని అన్నారు.
అశోకుడు,అక్బర్ చక్రవర్తుల తరహాలో సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేసేందుకే అభివృద్ది వికేంద్రీకరణను సీఎం చేపట్టారని వివరించారు
undefined
సీఎం జగన్ కర్నూలు అభివృద్ది చేస్తానంటే తెలుగు దేశం పార్టీ వ్యతిరేకించడం తగదన్నారు. అభివృద్దిని వ్యతిరేకిస్తే టిడిపి పాపాన పోతారని... అభివృద్దిని వ్యతిరేకించడాన్ని చంద్రబాబు సహా టిడిపి నేతలు సరిచేసుకోవాలన్నారు.
read more అది నిరూపించు... ప్రాణత్యాగానికి సిద్దమే...: పేర్ని నాని సవాల్
వైసిపి చేనేత విభాగం రాష్ర్ట అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ... చేనేతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన చేనేతలు సహా బీసీలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింప జేస్తున్నది వైసిపి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
అభివృద్ది వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలని సీఎం ప్రయత్నిస్తుంటే టిడిపి ఓర్వలేక పోతోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే మంచి పనులు ఒర్వలేకే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేపట్టారని అన్నారు. సీఎం జగన్ పరిపాలన చాలా పారదర్శకంగా చేస్తున్నారని... అభివృద్ది వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలంతా సమర్థిస్తున్నారని పేర్కోన్నారు.
మాజి ఎంపి బుట్టారేణుక మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రానికి అప్పులున్నా సీఎం ఆలోచనా విధానంతో ఇచ్చిన హామీలను 8నెల్లల్లోనే నెరవేర్చారని అన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా మభ్యపెట్టి ప్రజలను మోసం చేసిందన్నారు.
read more సీఎం జగన్ ఇంటివద్దే గంజాయి దందా...: పంచుమర్తి అనురాధ సంచలనం
కర్నూలు జిల్లాను సమగ్రంగా అభివృద్ది చేయడమే వైసిపి లక్ష్యమన్నారు. అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్షానికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని... వికేంద్రీకరణపై క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరినీ ఎడ్యుకేట్ చేస్తామని రేణుక ప్రకటించారు.