తనకు సంబంధించిన కంపనీకి గతంలో కేటాయించిన భూముల లీజును వైసిపి ప్రభుత్వం రద్దు చేయడంపై మాజీ ఎంపీ, టిడిపి నాయకులు జేసి దివాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
విజయవాడ: తన సిమెంట్ కంపనీకి గతంలో ప్రభుత్వం కేటాయించిన భూముల లీజును జగన్ సర్కార్ రద్దు చేయడంపై జేసి దివాకర్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు ప్రభుత్వం పాలన గురించి కాకుండా పగ పగ అని రగిలిపోతోందని... దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం అని కూడా అంటారంటూ కామెంట్ చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జెసి దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజు రద్దు కంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే తాను ఆలోచిస్తున్నానని అన్నారు. దాంతో పోలిస్తూ తన కంపనీకి జరిగిన అన్యాయం ఏ పాటిది అని అన్నారు.
undefined
ఈ లీజు రద్దు వ్యవహారంపై కోర్టులో తేల్చుకుంటానంటున్న జెసి దివాకర్ రెడ్డి వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం ఎవరి మీద పగ పెంచుకున్నా వాడి ఆర్థిక మూలాలను సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.అలా వాడిని చంపేసినంత పనిచేసి భార్య పిల్లలు అడుక్కు తింటుంటే అప్పుడు వారి ఈగో శాంతిస్తుందని... ఇదే ఫ్యాక్షనిజం అంటే అని జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
read more ''శవాన్ని పీక్కుతున్న ఎలుకలు... ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్..''
ఇప్పటివరకు అతడి ట్రావెల్స్ పై దృష్టిపెట్టి బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి సంబంధించిన ఇతర వ్యాపారాలపై కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గతంలో ఇచ్చిన లీజుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది.
యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బిలో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులను గతంలో జేసికి చెందిన మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజుకు పొందాయి. తాజాగా ఆ లీజును జగన్ సర్కార్ రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఈ సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆదేశాల్లో పేర్కోంది.
ప్రభుత్వం లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కోంది.
ఇప్పటికే జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్ ట్రావెల్స్ ను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా జేసి బ్రదర్స్ కు సంబంధించిన 8 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు.
జేసికి మరో షాకిచ్చిన జగన్... ఈసారి సిమెంట్ కంపనీపై
నిబంధనలకు విరుద్దంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారని ఆర్టీఏ అధికారులు గుర్తించారు. మెుత్తానికి 8 బస్సులను సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికుల నుంచి దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇకపోతే అనంతపురం జిల్లాలోని హిందూపురంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 15 బస్సులను తనిఖీ చేయగా వాటిలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారని గుర్తించారు. అందులో భాగంగా 35 వేల జరిమానాను సైతం అధికారులు విధించారు.