టిడిపి మాడి మసి అవుతుంది... చంద్రబాబును అప్పుడే హెచ్చరించా: డీఎల్

By Arun Kumar P  |  First Published Nov 28, 2019, 3:20 PM IST

టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన అధికారంలో వుండగా ో మాట... కోల్పోయాక మరోమాట ఆడతారని విమర్శించారు.  


కడప: తెలుగు దేశం పార్టీలో పెరిగిపోయిన అవినీతి కారణంగా అధికారానికి దూరం అవుతారని మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడికి ఎన్నికలకు ముందే చెప్పానని మాజీ మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వంలో అయినా సామాన్య మానవునికి అవినీతి సెగ తగిలితే ఎంతటి గొప్ప చరిత్ర, బలం వున్న పార్టీ అయినా మాడి మసి అవ్వాల్సిందేనని అన్నారు. 

గత ఎన్నికల్లో టిడిపి తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావించానని... అందుకోసం పార్టీ టికెట్ ఆశించిన మాట నిజమేనని తెలిపారు. కానీ ఎన్నికల సమయానికి ఆ పార్టీ పరిస్థితిని చూసి వెనుకడుగు వేసినట్లు తెలిపారు. 

Latest Videos

undefined

గతంలో టిడిపి అధికారంలో వున్న సమయంలో  మైదుకూరు నియోజకవర్గంలో టిటిడి మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆగడాలు మితి మీరిపోయాయని ఆరోపించారు.  అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కావడంతో ఆడిందే ఆటలా పుట్టా ఆగడాలు సాగాయన్నారు. 

read more కడపలో మొరిగిన పిచ్చికుక్క ఇప్పుడు అమరావతికి వచ్చింది...: కొడాలి నాని

స్థానిక నాయకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఉద్దేశపూర్వకంగానే అవతలి వర్గం వారిపై 307 కేసు పెట్టించాడన్నారు. ఈ విషయం చాలా చిన్నదని...దీని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. 

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఒక మాట లెన్నప్పుడు ఒక మాట మాట్లాడారని అర్ధమవుతోందని విమర్శించారు. అవినీతిపై ప్రధాని మోడీ పోరాటం చేస్తున్నారని... దీంతో ఆయన్న నమ్మే ప్రజలు రెండవ సారి పట్టం కట్టారన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక సరఫరా పెద్ద సమస్యగా మారిందని... ఇసుక విధానం సరిగా అమలు పరచకపోతే ఇబ్బందులు తప్పవన్నారు.  ఓటుకు 2000 రూపాయలు ఇచ్చి గెలిస్తే ఏం సేవ చేస్తామని... స్థానిక సంస్థలు ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే చూసుకుంటారన్నారు.

read more ప్యాకేజీ కోసమే వీధిప్రదర్శనలు... పవన్ ను చూస్తే జాలేస్తోంది: విజయసాయి రెడ్డి

గతంలో చంద్రబాబు, లోకేష్ ల ఆధ్వర్యంలోనే అవినీతి జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసని...వీరి ప్రమేయం వుండటంవల్లే క్రింది స్థాయిలో కూడా అవినీతి పెరిగిపోయిందన్నారు. అదే అవినీతి ఇప్పటికి కొనసాగుతోందని డీఎల్ ఆరోపించారు. 
 

click me!