కుప్పంలో ఏనుగుల గుంపు బీభత్సం... అన్నదాతల ఆందోళన

By Arun Kumar PFirst Published Dec 8, 2019, 6:22 PM IST
Highlights

చిత్తూరు జిల్లా కుప్పం పరిధితో ఏనుగుల  గుంపు బీభత్సం సృష్టిస్తోంది. అటవీప్రాంతాన్ని వీడి గ్రామాలపై విరుచుకుపడుతున్న ఏనుగులు పంట పొలాలను నాశనం  చేస్తున్నాయి. 

చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఏనుగులు ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పక్కనే వున్న కర్ణాటక అటవీ ప్రాంతం నుండి ఇటీవలే ఓ ఏనుగుల గుంపు కుప్పం ప్రాంతానికి చేరినట్లు తెలుస్తోంది. ఈ గుంపు ఆహారంకోసం స్థానిక పంటపొలాలపై దాడిచేస్తూ పంటమొత్తాన్ని నాశనం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం పండించిప పంట నాశనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

నెల రోజుల క్రితం హోసూరు సమీపంలోని సానమావు ఆటవీప్రాంతానికి  100 ఏనుగులు వచ్చి మకాం వేశాయి. ఈ ఏనుగులు శూలగిరి అటవీ ప్రాంతం  మీదుగా కర్ణాటక ఎర్రగోలు అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇక్కడినుండి దాదాపు 30 ఏనుగులు వేరుపడి గుడిపల్లి  ప్రాంతానికి చేరుకున్నాయి. 

ఇదిలా ఉండగా డెన్కనికోట అటవీప్రాంతంలో సంచరిస్తున్న మరో 50 ఏనుగులు ఉండేదుర్గం అటవీప్రాంతానికి వచ్చి సమీప గ్రామాలలో రైతులు సాగుచేసిన రాగి పంటను నాశనం చేశాయి. ఆదివారం ఉదయం శాంతిపురం మండలం బిళ్ల కోగిల  గ్రామంవద్ద సుమారు 15 ఏనుగులు రావడంతో ఆప్రాంత ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు. 

read  more అలా చేస్తే చంపేస్తా...: ప్రియాంకను బెదిరించిన నిందితుడు

టమోటా, వరి, అరటి పంటలను ప్రస్తుతం ఎక్కువగా నాశనం చేసే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  రాళ్లబూదుగూరు గుడిపల్లి బెల్ల కోగిల ప్రాంతంలో విచ్చలవిడిగా ఏనుగులు తిరుగుతున్నందున కోతకు వచ్చిన రాగిపంటను కోయలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఏనుగులు  కేవలం ఒక్క రాత్రిలో 3 ఎకరాలకు పైగా రాగిపంటను తినేస్తాయని రైతులు వాపోయారు. రైతుల పంటలను నాశనం చేస్తున్న ఏనుగులను వెంటనే కర్ణాటక రాష్ట్రానికి తరిమెందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సరిహద్దు ప్రాంతరైతులు డిమాండ్ చేస్తున్నారు. 

read more  వైఎస్ వివేకా హత్యపై అనుమానాలు... జగన్ ను నిలదీస్తూ కన్నా లేఖ

అయితే అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చి గ్రామ ప్రాంతాలలో సంచరిస్తున్న ఏనుగుల మందకు చేరువగా వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం ప్రమాదకరమని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. గ్రామప్రజలందరూ ఈ ఏనుగుల గుంపుకు దూరంగా వుండాలని... త్వరలోనే వీటిని ఇక్కడినుండి తరిమేసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

click me!