భారీఎత్తున కోడికత్తుల తయారీ...కాకినాడలో పట్టుబడ్డ వ్యాపారి

By Arun Kumar P  |  First Published Dec 17, 2019, 4:22 PM IST

సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో సంబరాలకే కాదు కోడిపందేలకు కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారీఎత్తును కోడికత్తులను తయారుచేస్తున్న వ్యక్తిని కాకినాడ పోలీసులు అరెస్ట్  చేశారు.   


సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదేక్రమంలో కోడి కత్తులకు కూడా గిరాకీ పెరిగింది. దీంతో భారీఎత్తున పందేలకు ఉపయోగించే కత్తులను తయారుచేస్తున్న ఓ వ్యక్తిని కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుండి భారీమొత్తంలో కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.  

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో సంక్రాంతి  ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సంబరాల్లో భాగంగా కోడిపందేలు కూడా జరుగుతుంటాయి. నిషేదం వున్నప్పటికి పోలీసుల కళ్లుగప్పి భారీఎత్తున ఈ పందేలు జరుగుతుంటాయి. అయితే సాధారణంగా కోళ్ల మధ్య పందే పెడితే  పరవాలేదు కానీ వాటి కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతుంటాయి. ఇలా జంతుహింసకు పాల్పడటం చట్టరిత్యా నేరం. 

Latest Videos

undefined

read more  అధికారులతో గిరిజనులకు ఇబ్బందులు...పరిష్కారానికి సీఎం ఉత్తమ సలహా: మంత్రి శ్రీవాణి

ఈ క్రమంలోనే ఇలాంటి పందేలు జరక్కుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. దీంతో భారీ తనిఖీలు చేపడుతున్న కాకినాడ  పోలీసులు  కామాడి సోమరాజు అనే కత్తుల తయారీ దారుడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి సుమారు 12 లక్షల విలువచేసే 3,982 కత్తులు, కత్తుల తయారీ కి ఉపయోగించే రెండు మిషన్లు స్వాధీనం చేసుకున్నారు.  

తాళ్ళరేవు మండలం సీతారామపురంలో కత్తులు తయారుచేస్తుండగా అతన్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇలా కోడికత్తులను ఎవరైనా తయారుచేస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు ప్రకటించారు.

read more  తెలంగాణలో మద్యం ప్రియులకి షాకింగ్ న్యూస్...ఏ బ్రాండ్ పై ఎంతంటే..?

click me!