విశాఖలో సీఐఎస్‌ఎఫ్ వాహనం బీభత్సం... ఒకరి మృతి, నలుగురికి గాయాలు

By Arun Kumar P  |  First Published Nov 27, 2019, 4:33 PM IST

విశాఖపట్నం గాజువాకలో సీఐఎస్ఎఫ్ వాహనం నానాబీభత్సం సృష్టించింది. రద్దీగా వుండే రోడ్డుపై ఈ ఘటన జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా వుంది.   


విశాఖపట్నం: నగరంలోని గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో  సీఐఎస్ఎఫ్ విభాగానికి చెందిన జీపు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న జనాలపైకి ఒక్కసారిగా  దూసుకెళ్లిన జీపు ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యింది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.  

ఇంతకూ ఏం జరిగిందంటే... సీఐఎస్ఎఫ్ విభాగానికి చెందిన జీపు గాజువాక ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ కు పిడ్స్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా జీపు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతున్న బాటసారులపైకి  దూసుకెళ్లింది. 

Latest Videos

read more  మేమే అలా మాట్లాడం... మీ జాతిరత్నాలతో జాగ్రత్త..: జగన్ కు సిపిఐ కార్యదర్శి హెచ్చరిక

దీంతో ఏం జరుగుతుందో అర్థం కాకు పాదచారులు భయాందోళనలతో పరుగులు తీసారు.అయినప్పటికి కొందరిని ఈ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలైనట్లు...అందులో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. 

అదుపుతప్పిన జీపు డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  స్థానికులు వెంటనే వచ్చి క్షతగాత్రులను కాపాడి చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

read more  గచ్చిబౌలి మసీదుబండ వద్ద బాలిక మృతదేహం కలకలం

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుండి ప్రమాదానికి సంబంధించిన వివరాలను  సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించారు. 

click me!