స్మశానంలా రాజధాని అమరావతి...అన్నది నిజమే, కానీ..: అసెంబ్లీలో బొత్స

By Arun Kumar P  |  First Published Dec 10, 2019, 2:39 PM IST

రాజధాని అమరావతిని స్మశానం పోల్చారంటూ మంత్రి బొత్సపై ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్వయంగా బొత్సనే  అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చాడు.  


రాజధాని అమరావతి నిర్మాణంపై మరోసారి పట్టణాభివృద్ధి, పురపాలకశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పందించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రాజధానిపై గతంలో తాను చేసిన కామెంట్స్ కు వివరణ ఇచ్చాడు. తాను మొత్తంగా ఏం మాట్లాడానో వదిలేసి కేవలం రాజధానిని స్మశానంతో పోల్చానంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. 

''నేను రాజధానిని శ్మశానం అన్నానన్నారు అధ్యక్షా.... కానీ నేనేమన్నానో వాళ్లు తెలుసుకోవాలి అధ్యక్షా. ఆ రోజు అసలు నేనేమన్నానో ఈ సభ సమక్షంలో చెబుతున్నాను. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాజధాని పర్యటనకు వెళ్తారంట గదా అని ఓ విలేకరి అడిగాడు... అందుకు  సమాధానంగా ఏం వెళ్తాడయ్యా పచ్చని పొలాలు, సంవత్సరానికి మూడు పంటలు పండే భూములని నాశనం చేశారు. అక్కడి పరిస్థితులు అన్నీ తెలిసి ఇలా చేశారు... ఇప్పుడు చూస్తే ఆ ప్రాంతం శ్మశానవాటికలా తయారు చేశారు. 
 
చంద్రబాబు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కానీ ఐదువేల కోట్ల రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదు. రూ.840 కోట్లు రూపాయలు కన్సెల్టెంట్లకు కోసం ఎంఓయూలు మాత్రం చేశారు. రూ.320 కోట్లు ప్రజాధనాన్ని  దుర్వనియోగం చేశారు. 

Latest Videos

undefined

read more అది నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్

వంద అడుగుల లోతుకు పునాది తీయవలిసిన పరిస్ధితులు రాజధాని ప్రాంతంలో ఉన్నాయి.  ఈ రకమైన పరిస్ధితులున్నాయని మాత్రమే తాను మాట్లాడాను. ఈ పరిస్ధితులను ఇప్పుడు వచ్చి ఏం చూస్తాడయ్యా అని మాత్రమే అన్నాను అధ్యక్షా... దాన్ని ఓ పత్రికలో వేరే అర్థాలు వచ్చేలా రాయించింది వీళ్లే అధ్యక్షా... ఇప్పుడు వీళ్లే మాట్లాడుతారు'' అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

''రాజధాని గురించి మాట్లాడుతున్నప్పుడు రాజధాని ఉంటాదా ఉండదా... దీనికి అనుమతి ఉందా లేదా అని డైరెక్టుగా అడగండి తప్పులేదు... దానికి సమాధానం చెప్తాం. కానీ 
ఇవాలొచ్చి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వచ్చి పర్మిషన్‌ ఇచ్చిందా అని అడుగుతారా. అధ్యక్షా గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు దీనికి సంబంధం లేదు. పర్మిషన్‌ ఇచ్చింది స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌  ఇంఫాక్ట్‌ ఎసెస్‌మెంట్‌ అధారిటీ (ఎస్‌ సి ఐ ఏ ఏ) అని గుర్తుపెట్టుకోవాలి. 

read more  శవం దొరికితే వదలరా, నీకు ఆత్మసాక్షి లేదా: చంద్రబాబుపై జగన్ ఫైర్

ప్రతిపక్ష సభ్యులు అవన్నీ వదిలేసి ఏవేవో అడిగారు. కాబట్టి ఏదైతే అమరావతి నగరం ఉందో, ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చారో వాటిన్నంటికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారు కూడా చెప్పారు అవన్నీ డెవలప్‌ చేసి ఇవ్వాలనే  ఆలోచనతో ఉన్నామని. త్వరలోనే వారందిరికీ  డెవలప్‌ చేసి ప్లాట్లన్నీ ఇస్తామని తమరి ద్వారా చెపుతున్నాను.'' అని బొత్స వెల్లడించారు. 

 

click me!