బిజెపితో పవన్ పొత్తు వెనుక చంద్రబాబు: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Jan 17, 2020, 6:30 PM IST

జనసేన-బిజెపి పార్టీల పొత్తు వెనుక తెలుగుదేశం పార్టీ హస్తమున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు దొడ్డిదారిన పవన్ సాయంతో బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నం  చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 


పవన్ ను అడ్డుపెట్టుకుని మళ్లీ బిజెపితో కలవాలని తెలుగుదేశం పార్టీ కొత్త రాజకీయాలను మొదలుపెట్టిందని మంత్రి అవంతి  శ్రీనివాస్ ఆరోపించారు. ఇది పవన్ కల్యాణ్, బిజెపిల మధ్య కుదిరిన పొత్తు అనేకంటే చంద్రబాబు-బిజెపి ల మధ్య కుదిరిన పొత్తు అనడమే సమంజసంగా వుంటుందన్నారు. ఇలా పవన్  రూపంలో దొడ్డిదారిలో బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి అన్నారు. 

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు నిలకడలేదని... గత ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు బిజెపి పంచన చేరాడని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే వామపక్షపార్టీలకు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరడం అవకాశవాద రాజకీయమే అన్నారు. అసలు పవన్ కు కాస్తయినా నిలకడ లేదని అన్నారు. 

Latest Videos

undefined

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, సీఎం  జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా బలహీనపర్చాలని చూసినప్పటికి ప్రతిపక్షాలు సక్సెస్ కాలేకపోతున్నాయని అన్నారు. వారు చేసే పనులతో జగన్ బలం తగ్గడం కాదు మరింత పెరుగుతోందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలిసి బిజెపితో పొత్తుపెట్టుకుని కుట్ర  పన్నారని...  అయినప్పటికి  జగన్ బలం పెరిగిందే తప్ప తగ్గలేదన్నారు. 

read more  ఓఎల్‌ఎక్స్‌లో జనసేన విక్రయం, సిగ్గులేదా: పవన్ పై మంత్రి నాని ఫైర్

పవన్ కళ్యాణ్  జనసేన పార్టీని ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి పెట్టారని  మరోమంత్రి పేర్నినాని విమర్శించారు. పవన్ నాయుడు మాటలకు ఏం విలువ ఉందని పేర్ని నాని ప్రశ్నించారు. 2014లో మోడీ, బాబును గెలిపించారని పవన్ చెప్పారు. 2019లో కూడ వైఎస్ జగన్ ను కూడ గెలిపించారని చెప్పారని మంత్రి నాని ఎద్దేవా చేశారు. 2024లో కూడ జగన్‌ను మళ్లీ తానే గెలిపించారని నాని విమర్శలు గుప్పించారు.

 చంద్రబాబు అవాక్కయ్యేలా పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు లోకేష్ పై నమ్మకం లేనందునే పవన్ కళ్యాణ్ ను దత్తత తీసుకొన్నారని మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూటకో మాట మాట్లాడే పవన్ మాటలకు విలువ ఏముంటుందన్నారు మంత్రి. 2014 లో సీట్లు గెలవలేని పవన్ కల్యాణ్ 2024 లో ఏం గెలుస్తారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. బీజేపీతో భేషరతుగా పవన్ కళ్యాణ్ కలవటం లో ఉద్దేశ్యం ఏమిటో తెలపాలని పవన్ కళ్యాణ్‌ చెప్పాలని మంత్రి కోరారు.

read more  బిజెపితో పవన్ పొత్తు వెనుక చంద్రబాబు: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

గతంలో ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీ పై ప్రధాని మోదీ,అమిత్ షా పై  విమర్శలు చేసిన విషయాన్ని నాని గుర్తు చేశారు. పవన్ ఇప్పుడు షరతుల తో కూడిన ఒప్పందం ఎందుకు చేసుకోలేదో చెప్పాల్సిందిగా కోరారు. బేషరతుగా బీజేపీ తో లొంగి పోవటానికి పవన్ కు సిగ్గు అనిపించటం లేదా పవన్ కళ్యాణ్‌పై మంత్రి పేర్నినాని విమర్శలు గుప్పించారు.
 

click me!