జమ్మికుంటలో దూసుకుపోతున్న కారు... ఈటల సమక్షంలో భారీగా చేరికలు

By Arun Kumar PFirst Published Jan 17, 2020, 5:51 PM IST
Highlights

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీకిదిగిన అభ్యర్ధులతో మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం సమావేశమయ్యారు. 

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో వుంచుకుని అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం జమ్మికుంటలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీకిదిగిన అభ్యర్థులతో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

ఈ సమావేశం అనంతరం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన 200 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ... జమ్మికుంట పట్టణ అభివృద్దికి పాటుపాడింది టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం  హయాంలో  ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలయ్యాయని... అవే ఇప్పుడు తమ అభ్యర్ధుల గెలుపుకు కారణం కానున్నాయని అన్నారు. 

read more  మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..

జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ది చేసే సత్తా కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కాబట్టి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి పట్టణాన్ని అద్దంలా మరింత సుందరంగా తయారు చేసుకోవాలని అన్నారు. 

ఇప్పటికే ఇక్కడి పిల్లల కోసం కూలిపోతున్న కళాశాల భవనాన్ని కట్టుకున్నట్లు తెలిపారు. అలాగే నాయిని చెరువును అందంగా పబ్లిక్ గార్డెన్స్ లాగా చేసుకుని ప్రజలు సరదాగా గడిపే ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. ఇలా చాలా అభివృద్ది పనులు  చేపట్టాం కాబట్టి జమ్మికుంటలోని 30 వార్డులకు 30 టీఆర్ఎస్ పార్టీనే గెలవబోతోందన్న నమ్మకంతో వున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.


 

click me!