ఏసిబి అధికారులా.... దారి దోపిడీ దొంగలా...: పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్

By Arun Kumar PFirst Published Oct 30, 2019, 3:31 PM IST
Highlights

అవినీతి నిరోధక శాఖ అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అయ్యారు. నిజాయితీగా వుండాల్సిన ఏసిబి అధికారులే దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మంత్రి ఆరోపించారు.  

అమరావతి: కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అరికట్టే వారే లంచాలకు అలవాటుపడి అడ్డదారులు తొక్కడం దారుణమన్నారు. ప్రస్తుత ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ఇప్పటికే ఈ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ డీజీ,హోం మంత్రితోనూ మాట్లాడినట్లు తెలిపారు. పలు కేసుల్లో విచారణే అవసరం లేకుండా పూర్తి సాక్ష్యాధారాలున్నా ఏసిబి అధికారులు పట్టించుకోకుండా నిందితులతో బేరసారాలు జరుపుతున్నట్లు ఆరోపించారు. కాబట్టి తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. ఏసీబీ అధికారులపై కూడా అలాగే కేసులు పెట్టాలని సూచించారు.

తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా సస్పెండ్ చేయాలన్నారు.లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..? అని ప్రశ్నించారు. 

read more  సొంతజిల్లా అభివృద్దికై... ఇరిగేషన్, పరిశ్రమల శాఖ మంత్రుల భేటీ

ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే... మా శాఖకు చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. 

ఇటీవల మధురవాడ సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా సాగిన విషయం తెలిసిందే. ఈ  నెల 9వ తేదీన స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి దాడులు చేపట్టింది. ఈ దాడిలో పలు కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తారుకేశు పై చర్యలు తీసుకున్నారు. 

read more  చంద్రబాబు ఓ రాజకీయ దళారి... లోకేష్ డైటింగ్ కోసమే...: చీఫ్ విప్ గడికోట

అయితే తనను కావాలనే కొంతమంది ఇలా ఏసిబి వద్ద ఇరికించారని సదరు రిజిస్ట్రార్ సంబంధిత శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి సిసి కెమెరా పుటేజీలను కూడా మంత్రికి సమర్పించారు. దీంతో ఏసిబి అధికారులపై తీరుపై ఫైర్ అయిన మంత్రి విశాఖ ఏసిబి చీఫ్ కు ఫిర్యాదు చేశారు. 

click me!