అసెంబ్లీ చీఫ్ మార్షల్ కు మండలి ఛైర్మన్ వార్నింగ్

By Arun Kumar P  |  First Published Dec 12, 2019, 5:44 PM IST

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రారంభం సందర్భంగా టిడిపి నాయకులు, అసెంబ్లీ  మార్షల్స్ కి మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన మండలి ఛైర్మన్ షరీఫ్ చీఫ్ మార్షల్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.  


అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజైన ఇవాళ(గురువారం) ప్రారంభసమయంలో గందరగోళం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సభలో పాల్గొనేందుకు వస్తున్న తమపట్ల మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్ తో సహా మిగతావారంతా నిరసనకు దిగారు. అంతటితో ఆగకుండా ఈ విషయంపై మండలి ఛైర్మన్ కు షరీఫ్ కు లోకేశ్ సారథ్యంలోని టిడిపి ఎమ్మెల్సీల బృందం ఫిర్యాదు చేసింది. 

దీంతో అసెంబ్లీ చీఫ్ మార్షల్ కు మండలి ఛైర్మన్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయొద్దంటూ రూలింగ్ జారీచేశారు. మరోసారి సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టీడీపీ సభ్యులు హెచ్చరించారు. 

Latest Videos

మంత్రుల సమక్షంలోనే మండలి ఛైర్మన్ ను టిడిపి సభ్యులు కలిశారు.  దీంతో ఎమ్మెల్సీలతో పద్దతిగా వ్యవహరించాలంటూ చీఫ్ మార్షల్ కు మంత్రులు బుగ్గన  రాజేంద్రనాధ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ సూచించారు. 

AP Assembly : సచివాలయం ముందు బైఠాయించిన చంద్రబాబు...

ఈ సందర్భంగా అసెంబ్లీ గేట్ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ సభ్యుల పట్ల మార్షల్స్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను మండలి ఛైర్మన్, మంత్రులకు ఎమ్మెల్సీల బృందం చూపించింది. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... మండలి ఛైర్మన్ ను వైసిపి మంత్రుల సమక్షంలో కలిసామన్నారు. గత మూడు రోజులుగా తమను దొంగలు, రౌడీలుగా చూస్తున్న విషయంపై కూడా చైర్మన్ కు ఫిర్యాదు చేసామన్నారు. మహిళా మార్షల్స్ పై తాము అసభ్యంగా ప్రవర్తించామని ఆరోపించడం అవాస్తమన్నారు.తాము చూపించిన వీడియోలు చేసిన తర్వాత మాట్లాడలేదన్నారు. 

అసెంబ్లీకి, శాసనమండలికి వేర్వేరు కాండక్ట్ లు ఉంటాయని ...సభ్యులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించద్దని ఛీఫ్ మార్షల్ కు చైర్మన్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. 

read more  అసెంబ్లీ సాక్షిగా అవమానం.... దళితులంటే ఆయనకు అంత చులకనా: మంత్రి సురేష్

గురువారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుగా వెళ్లగా ప్లకార్డులతో లోపలికి వెళ్లొద్దని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. తమ ఆఫీసుకు తీసుకెళ్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా సెక్యూరిటీ వినలేదు. సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు, ఎమ్మెల్యేల అసెంబ్లీ ముందు బైఠాయించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపైనే టిడిపి నేతలు మండలి ఛైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. 

click me!