అసెంబ్లీ సాక్షిగా అవమానం.... దళితులంటే ఆయనకు అంత చులకనా: మంత్రి సురేష్

By Arun Kumar P  |  First Published Dec 12, 2019, 5:12 PM IST

గౌరవప్రదమైన మంత్రి పదవిలో వున్నప్పటికి తాను ఓ దళితుడినన్న చులకనభావంతో టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు అవమానకరంగా మాట్లాడారని విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.  


అమరావతి: గౌరవప్రదమైన మంత్రి పదవిలో వున్న తనను టిడిపి నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా అవమానించాడని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. తాను దళితుడినన్న చులకన భావంతోనే ఆయన అలా అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన  అభ్యంతరకమైన పదాన్ని వాడుతూ దురుసుగా ప్రవర్తించారని అన్నారు.  

''నేను సభలో మాట్లాడుతుంటే అచ్చెన్నాయుడు సభలో కూర్చోవటానికి ఇబ్బందిపడుతున్నారట. స్వయంగా  ఆయనే ఈ మాట అన్నారు. అన్నారు. ఒక దళితుడుగా, విద్యాశాఖ మంత్రిగా సీఎం నాకు అవకాశం ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తే ప్రతిపక్ష  సభ్యులు మాత్రం దళితుడు మాట్లాడుతుంటే ఇబ్బందిపడుతున్నారనటం దారుణం..  ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. అలా నన్ను ఉద్దేశించి ఎందుకు మాట్లాడారో వారి విజ్ఞతకే వదిలివేస్తున్నాను'' అని సురేష్ పేర్కొన్నారు. 

Latest Videos

భోజన విరామం తర్వాత ప్రారంభమైన శాసనసభలో ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత, నాడు-నేడు స్వల్ప వ్యవధి చర్చను చేపట్టారు. ఈ చర్చ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతూ సీఎం వైయస్‌ జగన్‌  చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. జీఓ ఎంఎస్‌ 85 ద్వారా వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని పెంచుకుంటూ 10వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. ఎక్కడా లేని నూతన ప్రక్రియను ఏపీలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా అన్ని పేపర్లు.. టైమ్స్‌ ఆఫ్ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ పత్రిక కూడా కథనాలను ప్రచురితం చేశాయని చెప్పారు. 

రాష్ట్రంలో ఇంగ్లీషును తప్పనిసరి చేస్తున్నారని, ఇది ఏ విధంగా అమలు జరుగుతుంది. దీనికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చర్చ జరుగుతోందని ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయని సురేష్ ప్రస్తావించారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని రాజకీయం చేయాలని నవంబరులో జీఓ రిలీజ్‌ చేసినప్పుడు తెలుగు భాషను చంపేస్తున్నారు. తెలుగు భాషను తొక్కేస్తున్నారు.. రాబోయే రోజుల్లో అ అంటే అమ్మ అనరని విపరీత ధోరణిలో మతం రంగు కూడా పులిమారన్నారు. 

పవన్ కల్యాణ్ రైతు దీక్ష: నాగబాబు సైతం.. (ఫొటోలు)

ఈ విషయంలో చంద్రబాబు కూడా విమర్శలు చేశారన్నారు. తర్వాత చంద్రబాబుకు అలవాటైన యూటర్న్‌ తీసుకొని మేం కూడా ఇంగ్లీషు మీడియానికి వ్యతిరేకం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ దీనిపై ఇంతవరకు స్పష్టమైన వైఖరి తెలియజేయలేదన్నారు. ఇంగ్లీషు మీడియంకు అనుకూలమా? వ్యతిరేకమా అన్నది చంద్రబాబు చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు. 

ఈ రోజు అన్ని పేపర్లలో ఏపీ దిశా అని కఠినమైన చట్టం చేశారని రాశారని మంత్రి తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో ధైర్యం, నమ్మకం కావాలన్నారు. సీఎం జగన్‌ ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. నిర్ణయం తీసుకుంటే అది అమలు జరుగుతుందని సురేష్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వాళ్లు ఏమీ చెప్పలేకపోయారని సురేష్ ఎద్దేవా చేశారు. 

రివర్స్‌ టెండరింగ్‌ ఎక్కడ? జ్యుడిషియల్‌ రివ్యూ ఎక్కడ అని ప్రతిపక్షాలు అపహాస్యం చేశారని .. ప్రతిరోజు ఎడ్యుకేషన్‌ దగ్గర నుంచి ప్రతి శాఖలో రివర్స్‌ టెండరింగ్‌ జరుగుతోందని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా చర్చ జరుగుతున్నప్పుడు చాలా అంశాలు వస్తాయని సురేష్‌ అన్నారు. 

సీఎం ఒంగోలు సభలో "నాడు-నేడు" ప్రారంభం సందర్భంగా ఎందుకు ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టాల్సి వస్తోందో స్పష్టంగా ప్రకటించారని మంత్రి తెలిపారు. కుప్పంలో ఎన్ని ప్రైమరీ స్కూల్స్‌ ప్రారంభించారో చూసుకోండని.. అక్కడి స్కూల్స్‌ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడండని మంత్రి సురేష్‌ అన్నారు. దాంట్లో రాజకీయాలు చేయటం లేదన్నారు. కుప్పంలో 216 స్కూల్స్‌ ఉన్నాయంటే వాటికీ నిధులు కేటాయిద్దామని సీఎం  అన్నారని మంత్రి తెలిపారు. ఇదొక విజన్‌, దార్శనికత, ముందు చూపు ఉండాలని మంత్రి పేర్కొన్నారు. 

ఇప్పటికే అనేక సాంకేతిక పరిజ్ఞానాలు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులను ఏవిధంగా తర్ఫీదు చేయాలని జగన్‌ గారు ఆలోచించాలన్నారు. చంద్రబాబు నాయుడు 2020, 2030, 2050కి రోడ్‌మ్యాప్‌ ఇచ్చారు తప్పు ఏమీ చేయలేదని సురేష్‌ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం మాటలు చెప్పదని చేతలు చేస్తామని మంత్రి తెలిపారు. మాటలు కాదు.. చేతలు మాత్రమే కావాలన్నారు.

read more  జగన్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్ట్... కీలక ఆదేశాలు

ఈ విద్యావ్యవస్థ మీద పెట్టుబడి సమాజం మీద పెట్టుబడిలా ఉండాలని సురేష్‌ అన్నారు. బడ్జెట్‌లో విద్యాశాఖకు 16-18% నిధులు (రూ.33వేల కోట్లు) కేటాయించారన్నారు. ఈ ఇంగ్లీషు భాష గురించి 60-70 ఏళ్ల క్రితం అంబేద్కర్‌ అన్నమాటలను సురేష్ స్ఫురణ చేశారు. ఇవి పులి పాలు లాంటివన్నారు. ఇంగ్లీషు మాధ్యమం మీద పట్టుసాధించాలి. చాలా బలవంతులు అవుతారని భవిష్యవాణి అంబేద్కర్ ఆనాడే చెప్పకనే చెప్పారన్నారు. 

పులిపాలు విలువ పులిబిడ్డకే (వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి) తెల్సు కాబట్టి రాష్ట్ర ప్రజలకు రుచి చూపించాలని ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.  ఇంగ్లీషు ప్రపంచ భాష. మీడియం ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలంటే ఇంగ్లీషు అవసరమన్నారు. ఇతరులు ఇచ్చే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

దివంగత నేత మహానేత వైయస్సార్ ఇంగ్లీషు మీడియం స్కూల్స్‌ ప్రవేశపెట్టారని సురేష్ అన్నారు. 64%పైగా స్కూల్స్‌ వచ్చాయన్నారు. 45వేల స్కూ్ల్స్‌కు గాను.. 30-35% మాత్రమే ఇంగ్లీషు మీడియంలో ఉన్నాయి. 96% ఇంగ్లీషు మీడియం స్కూల్స్‌ ప్రైవేటు మేనేజ్‌మెంట్‌లో ఉన్నాయని సురేష్ తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలు స్కూల్స్ పెట్టలేవుని పేద పిల్లల తల్లిందండ్రులు ఇంగ్లీషు మీడియంలో చదివించాలని ఆశ ఉందన్నారు. దాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రైమరీ స్కూల్స్‌ సెక్షన్‌లో ఎక్కువగా ఇంగ్లీషు మీడియం స్కూల్స్ వచ్చాయని ప్రభుత్వం గుర్తించిందన్నారు. 

ఆ ప్రాంతాల్లో ఇంగ్లీషు మీడియం స్కూల్స్‌ లేనందువల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు పేద బడుగు బలహీన, దళిత వర్గాల వారికి పేద ఉన్నతవర్గాల వారు ఇంగ్లీషు మీడియానికి దూరం అయ్యారని మంత్రి సురేష్ అన్నారు. ఈరోజు సామాజిక శాస్త్రవేత్తగా అందరికీ అవకాశాలు ఇవ్వాలని అంబేద్కర్‌ భావజాలాన్ని, స్ఫూర్తితో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టారని సురేష్ అన్నారు. ప్రతిపక్షాల బాధంతా తెలుగు ఏమి అవుతుందంటున్నారని అయితే తెలుగు భాషను కాపాడటానికి మేం కట్టుబడి ఉన్నామని సురేష్ స్పష్టం చేశారు. 

అంతేకాకుండా తెలుగు భాషను కంపల్సరీ సబ్జెక్ట్‌ చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలుగు భాషా పండితులకు (ఎస్‌జీటీ) ఫైల్‌ ఎందుకు పెండింగ్‌లో ఉందని సీఎం జగన్‌ విచారించి అందరితో సమానంగా ప్రమోషన్లు ఇవ్వమని ఆదేశించారని సురేష్ తెలిపారు. తెలుగు భాషా వికాసానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో.. స్వాగతించాలని, అందరూ మద్దతు పలకాలని సురేష్ కోరారు. 

జీఓ నెంబర్‌ 85 వచ్చిన తర్వాత టీడీపీ ఎక్కడ యూటర్న్‌ తీసుకున్నారో చెప్పగలనని 65,000 స్కూల్స్‌లో 65% తెలుగు మీడియంలో ఎందుకు ఉన్నాయో టీడీపీ సభ్యులు సమాధానం చెప్పాలని మంత్రి సురేష్ డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం ప్రైవేటు యాజమాన్యాలు, కార్పొరేట్‌ కళాశాలలకు కొమ్ము కాసేవిధంగా ఇంగ్లీషు మీడియాన్ని అందరికీ అందకుండా చేశారని సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేవలం ఒక వర్గం వారికి అది అందించాలని కార్పొరేట్‌ కళాశాలలను వ్యాపారంగా చూశారు తప్ప నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఐదేళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని ఉంటే ఇప్పటికీ 65% తెలుగులో ఎందుకు ఉన్నాయో చెప్పాలన్నారు. గత ఐదేళ్లలో ఇంగ్లీషు మీడియం స్కూల్స్‌కు స్వేచ్ఛను ఇచ్చామని టీడీపీ సభ్యులు అంటున్నారు. 

కేవలం మున్సిపల్‌ స్కూల్స్‌కు మాత్రమే ఎందుకు ఇచ్చారు? అప్పటి మున్సిపల్‌ మంత్రి నారాయణ, చైతన్య సంస్థల మెటీరియల్‌ను రూ.17 కోట్లతో పంపించటం వాస్తవం కాదా అని సురేష్ సూటిగా ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.  


 

click me!