జగన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం... ఐఆర్ఎస్ అధికారి డిప్యుటేషన్ రద్దు

By Arun Kumar PFirst Published Dec 14, 2019, 7:24 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ వివాదం కొనసాగుతుండగానే జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఐఆర్ఎస్ అధికారి వెంకట గోపీనాథ్ డిప్యుటేషన్ ను రద్దుచేస్తూ జీవో జారీ చేసింది.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్ఎస్ అధికారి సీహెచ్.వెంకట గోపీనాధ్ డిప్యుటేషన్ ను రద్దు చేసింది. అయితే ఆయన   కోరిక మేరకే రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

వచ్చే ఏడాది జూన్ 26 వరకూ  డిప్యూటేషన్ ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేయాలని గోపీనాధ్ ప్రభుత్వాన్ని కోరారు. అతడి విన్నపాన్ని మన్నించిన ప్రభుత్వం తాజాగా మాతృ శాఖ అయిన సెంట్రల్ డైరెక్ట్ టాక్స్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

గత టీడీపీ హయాంలో వైద్యారోగ్య శాఖలో పనిచేసిన గోపీనాధ్ పై పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఈ  నేపథ్యంలో అతడిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి గతంలో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఫార్సు కూడా చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

read more ఆ ఐఆర్ఎస్ అధికారిపై జగన్ కు వ్యక్తిగత కక్ష... ఎందుకంటే...: వర్ల రామయ్య

ఇప్పటికే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత టీడీపీ హయాంలో ఏపీ ఆర్ధిక అభివృద్ది మండలి సీఈవోగా పనిచేసిన కిశోర్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం కృష్ణకిశోర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా సీఐడీ, ఏసీబీ డీజీలకు ఆదేశాలకు జారీ చేసింది.
 
కృష్ణకిశోర్ ఈడీబీ సీఈవోగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు అమరావతిని విడిచి వెళ్లరాదని ప్రభుత్వం కృష్ణకిశోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 

read more జాస్తి మాత్రమే కాదు వారుకూడా చంద్రబాబు మనుషులే...అందువల్లే: అంబటి

ఈ సస్పెన్షన్  ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వివాదం చెలరేగుతోంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో జాస్తి కీలకంగా వ్యవహరించడనే కక్షతోనే అతడిపై వేటు వేశారని టిడిపి నాయకులు ఆరోపిస్తుంటే కేవలం అతడిపై  వచ్చిన  అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ సమయంలో గోపినాథ్ డిప్యుటేషన్ రద్దు కూడా చర్చనీయాంశంగా మారింది. 
 

click me!