దేవాదాయ శాఖలో భారీ ఉద్యోగ భర్తీకి ఏర్పాట్లు..: మంత్రి వెల్లంపల్లి

By Arun Kumar PFirst Published Oct 19, 2019, 12:16 AM IST
Highlights

దేవాదాయ శాఖలో సమాల మార్పులు చేపట్టి ప్రతి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం సరిపోవు నిధులు అందిస్తామని ఏపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. 

అమరావతి: దేవాలయ శాఖకు చెందిన భూములను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి కీలక అంశాలపై చర్చించారు. 

దేవాలయాల దూపదీప నైవేద్యం, మెయింటెనెన్స్ తదితర అంశాలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి గుడిలో దూపదీప నైవేద్యాలు అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

దేవాదాయ శాఖకు సీఎం జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ లో 234 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు. ధూపదీప నైవేద్యానికి 5 నుంచి 10వేలు వరకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 

దేవాలయాల ఖాళీ స్థలాలు సంరక్షించేందుకు మునిసిపాలిటీ, పంచాయతీ అధికారుల  సహాయం తీసుకోవాలని సూచించారు. దేవాలయ స్ధలాల వివరాలు వారికి ఇచ్చి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరాలని తెలిపారు.  అంతేకాకుండా వాటిని ఎవరికి ఇవ్వకుండా ఆదేశాలఃివ్వడమే కాదు వేరే ఇతర కార్యక్రమాలను వాడుకోకుండా చూసుకోవాలన్నారు.

దేవాదాయ శాఖ తరపున ఒక ఐపిఎస్ అధికారిని నియమించుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దేవాదాయ శాఖలో అనేక పోస్టులు ఖాళీగా వున్నాయని...వాటిని భర్తీ చేయాలని సీఎం జగన్ ని కోరనున్నట్లు వెల్లడించారు.

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. అర్చకుల భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి అభిప్రాయపడ్డారు. 

జగన్ స్త్రీ పక్షపాతి...కాబట్టే మధ్యపాన నిషేధం...: మంత్రి వనిత

దేవాలయాలాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆఖరు వరకు వారానికి ఒకసారి తమ శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో పర్యటించి స్థానికంగా వుండే దేవాలయాల్లో పరిస్థితుల గురించి  తెలుసుకోనున్నట్లు తెలిపారు.

భక్తులకు మెరుగైన సేవలు అందించాలనేదే తాము లక్ష్యం గా పెట్టుకున్నామని...  గత ప్రభుత్వం మాదిరిగా నిబంధనలకు వ్యతిరేకంగా  పనిచేయాలనుకోవడం లేదు. అందువల్లే అలా జారీ చేసిన జీవోలను రద్దు చేయాలనుకుంటున్నామని ప్రకటించారు.

చంద్రబాబు హయాంలో టిడిపి పెద్దలు తమ బినామీలకు దేవాలయాల భూములు అప్పనంగా ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తే కాదు భయం, దేవాలయాల భూములంటే విలువలేదు. గత ప్రభుత్వం పుష్కరాల సమయంలో కూల్చిన దేవాలయాలను తిరిగి నిర్మిస్తామని  మంత్రి ప్రకటించారు. 

click me!