జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం... వారికోసం ప్రత్యేకంగా ప్రభుత్వ శాఖ

By Arun Kumar PFirst Published Dec 9, 2019, 4:58 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో మరో కీలక మార్పు చేపట్టింది. మరో నూతన శాఖను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వున్న వివిధ శాఖలకు తోడుగా మరో ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయాలని వైసిపి  సర్కార్ నిర్ణయించింది. ఇందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి తుది అనుమతి లభించడంతో తాజాగా నూతన శాఖ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదలచేసింది. 

ఈ ఉత్తర్వులతో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖ ఏర్పాటయ్యింది. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల అంశంతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధి  శిక్షణ అందించే అంశాన్ని ఈ శాఖ పర్యవేక్షించనుంది. 

Video: దిశ నిందితుల ఎన్‌కౌంటర్... హ్యాట్సాఫ్ టు కేసీఆర్..: వైఎస్ జగన్

కొత్తగా ఏర్పాటుచేసిన ఈ విభాగానికి ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, అవిష్కరణల విభాగాన్ని ఈ శాఖలోనే విలీనం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో  36 శాఖలుండగా కొత్తగా చేరిన నైపుణ్యాభివృద్ధి, శిక్షణాశాఖతో ఆ సంఖ్య 37 కి చేరింది. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పినే లక్ష్యంగా ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

read more ప్రజలేమైనా సరే...హెరిటేజ్ లాభపడితే చాలా: చంద్రబాబుకు బుగ్గన చురకలు

click me!