ప్రజలేమైనా సరే...హెరిటేజ్ లాభపడితే చాలా: చంద్రబాబుకు బుగ్గన చురకలు

By Arun Kumar PFirst Published Dec 9, 2019, 2:41 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు ఏమయిపోయినా పరవాలేదని... తన హెరిటేజ్ సంస్థ లాభాలో వుంటే చాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు.  అలా  ఉల్లిని అధికధరకు విక్రయిస్తున్న వ్యక్తి బయట నాటకాలాడటం విడ్డూరంగా వుందన్నారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఉల్లిగాటు తాకింది. ఆకాశానికంటిన ఉల్లి ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు చర్చకు పట్టబట్టాయి. నిత్యావసరాలను అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతోందన్న ఆరోపణలు చేస్తూ నిరసనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ  నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''ఆల్రెడీ ఉల్లిమీద చర్చిస్తామని చెపుతున్నాము. వాళ్లకు నిజంగా బాధ్యత ఉంటే, ఈ అంశంమీద చర్చించాలని ఉంటే ఒక గిప్ట్‌ రేఫర్‌లో స్పీకర్‌కు ఉల్లిగడ్డలిస్తారా. దాన్నిబట్టే వారు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో అర్ధమవుతోంది. 

నిజంగా వాళ్లకు అంత కన్సర్న్‌ ఉంటే తాము బయట రూ.25కు రైతుబజార్లలో అమ్ముతుంటే వాళ్ల హెరిటేజ్‌ మాల్స్‌లో రూ.200కే కేజీ ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు.  ప్రతిపక్షనేతకు బాధ్యత ఉంటే తాను పర్చేజ్‌ చేసిన ధరకే ఉల్లి అమ్మకాలు చేపడతానని చెప్పాలి. వాళ్లకు లాభాలు కావాలి...అక్కడ మాత్రం లాభాలు వదిలిపెట్టకూడదు. ఏం ప్రజల కోసం కాస్త లాభాన్ని తగ్గించి అమ్మితే బావుంటుంది కదా'' అంటూ చంద్రబాబు కు చురకలు అంటించారు. 

read  more వైసీపీ ఎంపీపై రేప్ కేసు: జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు

''ఉల్లిగడ్డల విషయం అందరికీ సంబంధించిన విషయం. ఉల్లిగడ్డల విషయంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉల్లిగడ్డల విషయంపై ముఖ్యమంత్రి బ్రీఫ్‌గా ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఇవాళ రైతుబజార్లలో రూ.25కే కిలో ఉల్లి ఇస్తోంది. ఎక్కడో షోలాపూర్, రాజస్ధాన్‌ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 

ఇంకా మెరుగుపర్చేదానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. అన్నిటికన్నా  ఉల్లి పట్ల ఒక ప్రోపర్‌ ఫార్మాట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఇలా గందరగోళాన్ని సృష్టించడం మంచిది కాదు'' అని ఆర్థిక మంత్రి సూచించారు. 

read more రెండు బెత్తం దెబ్బలు చాలన్నవాడు.. అప్పుడు గన్ ఎందుకు పట్టుకొచ్చాడు.. పవన్ పై రోజా

''ఇప్పుడు బిజినెస్‌లో మహిళల భద్రత పట్ల మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల. మహిళలు, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ వీటిని దేశం మొత్తం నిలబడి చూస్తోంది. అటువంటి సంఘటనే మొన్న హైదరాబాద్‌లో జరిగిన సంఘటన. అందులో భాగంగా చట్టం కూడా తీసుకురావాలి. చర్చకు రండి. మీరు మీ సలహాలు కూడా ఇవ్వండి అని స్టేట్‌మెంట్‌ ఇస్తున్నాం.

ఒక మహిళా, రాష్ట్ర హోంశాఖ మంత్రి స్టేట్‌మెంట్‌ ఇస్తుంటే వాళ్లు ఉద్దేశ్యపూర్వకంగా ఆటంకం  కలిగిస్తున్నారు. సభలో అతి ముఖ్యమైన మహిళల భద్రతమీద డిస్కషన్‌ జరుగుతుంటే దాన్ని మాత్రం పట్టించుకోరు. చివరకు స్పీకర్‌కు ఉల్లిగడ్డలు గిప్ట్‌ బాక్స్‌ ఇవ్వడం దారుణం. సభా సమయాన్ని వృధా చేయడం చాలా దారుణం, బాధ్యతా రాహిత్యం. మరీ ముఖ్యంగా  మహిళల పట్ల వారికి (ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి) ఎంత వరకు కన్సర్న్‌ ఉందనేది క్లియర్‌గా కనిపిస్తోంది'' అని బుగ్గన విమర్శించారు. 


 

click me!