బాత్రూంల పక్కన కూర్చుని పవన్ ఏం చేశాడంటే...: కన్నబాబు సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Nov 5, 2019, 7:51 PM IST

ఇసుక కొరత పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కావాలనే నానా హంగామా సృష్టిస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఆయన చంద్రబాబు డైరెక్షన్ లో యాక్షన్ చేయడం మానేయాలని సూచించారు.  


అమరావతి: అధికారం చేపట్టిన కేవలం 5 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు సీఎం  జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని వ్యవసాయ మంత్రి కె.కన్నబాబు తెలిపారు. ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి ఏం చేయాలో తోచక ఇసుక కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇసుకను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినట్లు విమర్శలు గుప్పిస్తున్నారని...ఇది సమంజసం కాదని మంత్రి మండిపడ్డారు. 

భారీ వరదలు, వర్షాల వల్ల ఇసుక తీయడం సాధ్యం కాలేదన్న విషయం వారికి కూడా తెలుసన్నారు.  రాష్ట్రంలో కొంత ఇసుక కొరత ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. కానీ సమస్యను అడ్డంపెట్టుకుని గుంటనక్కలా విపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా పవన్‌కళ్యాణ్‌ బయటకు వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేపడతారని అన్నారు.
 
తాజాగా విశాఖలో లాంగ్‌ మార్చ్‌ పేరుతో షో చేశారన్నారు. ఒక్క అడుగు కూడా నడవకుండా వాహనంపై ఊరేగడమే ఆయన లాంగ్ మార్చా అని ప్రశ్నించారు.  పక్కన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి పెట్టుకుని మాట్లాడటం మరీ విడ్డూరంగా వుందన్నారు. ఇసుక దోపిడి చేసిన వారినే పక్కన పెట్టుకుని మాట్లాడమేంటని ప్రశ్నించారు.

Latest Videos

మంత్రిగా అచ్చెన్నాయుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించారని ఆరోపించారు. ఇక అయ్యన్నపాత్రుడి కుమారుడు చిరంజీవిపై ఎన్నో విమర్శలు చేశారని.... అయినా ఆయనను పక్కన పెట్టుకుని పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగించారన్నారు. 

 read more వరదల్లో ఏపి ఇసుక హైదరాబాద్ కు కొట్టుకుపోతోందా...?: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు సెటైర్లు

గతంలో ఏరోజైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గళం ఎత్తారా? భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి కోసం గతంలో ‘ఛలో కాకినాడ’ చేపట్టినప్పుడు పవన్‌  ఎందుకు వారికి మద్దతు ఇవ్వలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇసుక సమస్య మరో 15 రోజుల్లో పరిష్కారం కానుందన్నారు. ఈ విషయం తెలిసి కూడా ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. 

ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలే అయిందని... కానీ నెల తిరగక ముందు నుంచే చంద్రబాబు, ఆయన పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెట్టారన్నారు.  తనను దత్తపుత్రుడు అన్నారని పవన్‌ విమర్శిస్తున్నారని... ఒకవైపు పవన్, మరోవైపు లోకేష్‌ రాష్ట్రంలో పర్యటిస్తూ కార్మికుల గురించి మాట్లాడుతుంటే దత్తపుత్రుడు అనక మరేమంటారని అన్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్‌లు వదలడం లేదన్నారు. అదే విధంగా డ్రామాలు చేస్తున్నారని.... మట్టి పిడతల్లో ఎవరైనా మజ్జిగ అన్నం తింటారా? అని ప్రశ్నించారు. ఇవాళ మారుమూల ప్రాంతాల్లో కూడా డిస్సోజల్స్‌ వాడుతున్నారని.... కానీ పవన్‌కు ఆ మట్టి పిడతలు ఎక్కడ దొరికావో ఎవరికీ తెలియదన్నారు. కారు డిక్కీలో కూర్చుని టీ తాగడం.... ట్రెయిన్‌లో టాయిలెట్‌ పక్కన కూర్చుని పుస్తకాలు చదువడం పవన్ కే చెల్లిందన్నారు. 

read more  video: జగన్ సొంత జిల్లాలో దారుణం: ఎమ్మార్వో కార్యాలయంలోనే అన్నదాత ఆత్మహత్యాయత్నం

వర్షం కురుస్తుంటే గొడుగు వేసుకుని ఆవుకు అరటిపండ్లు పెడతారా... ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారన్నారు. ఈ తరహా డ్రామాలు చంద్రబాబు డైరెక్షన్‌లో చేస్తే, వెంటనే వాటిని విడిచి పెట్టండని...ఎందుకంటే సినిమాల్లో మాదిరిగా నటిస్తూ డైలాగ్‌లు కొడితే ఓట్లు పడవని సూచించారు. అసలు వైయస్‌ జగన్‌కు  పవన్‌కు పోలికే లేదని.... జగన్‌  151 సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించారని తెలిపారు.

జగన్‌ ను చూసి సంస్కారం నేర్చుకోవాలని... 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెల్చినా ఎంత ఒదిగి ఉంటున్నారో చూడండని పవన్ కు చురకలు అంటించారు. టీడీపీ, జనసేన పార్టీలు వైయస్సార్‌సీపీకి రాజకీయ ప్రత్యర్థులని... ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పాల్సింది పోయి  ప్రతిదీ తప్పుగా చూస్తున్నారన్నారు.  2 లక్షల పుస్తకాలు చదివానన్న పవన్  వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండని ఎద్దేవా చేశారు.

 
 

click me!