ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.పెద్ద ఒప్పందంపై సంతకం చేయవచ్చు. ప్రత్యేకమైన గౌరవాన్ని పొందవచ్చు. శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. శుభకరమైన వ్యయాన్ని చేయవచ్చు. ఫలితంగా మీ కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ప్రణాళికలపై దృష్టి పెడతారు. మనస్సు ఆనందంగా ఉంటుంది. చట్టపరమైన వివాదాల్లో విజయాన్ని సాధిచడం వల్ల ఆనందంగా ఉంటారు. రోజు చివరి భాగంలో సమస్యలు ఉన్నప్పటికీ మీ శక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైన మార్పు ఉంటుంది. భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు సృజనాత్మకంగా ఉంటుంది. కళాకారులు పనులు పూర్తి చేయడంలో మీకు విజయం లభిస్తుంది. మీరు ఎక్కువగా ఇష్టపడే పని రోజు జరుగుతుంది. నూతన పథకాలు గుర్తుకు వస్తాయి. మీరు వాటిని అమలు చేస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో మీ అభిప్రాయాల ప్రకారం అనుకూల వాతావరణం ఉంటుంది. సహచరులు మీకు అన్ని విధాల సహకరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనడానికి మీకు అవకాశం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ రోజు మీరు చాలా తీరిక లేకుండా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాల్లో అధ్యయనం చేయడం, ఆసక్తి చూపడానికి మరికొంత సమయం పడుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో సీనియర్ అధికారులు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తారు. పవిత్రమైన పనుల్లో సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పరస్ఫర ప్రవర్తనలో సంయమనం, జాగ్రత్త వహించండి. కోపాన్ని నియంత్రించుకోండి. సమీపంలోని వ్యక్తుల నుంచి విభేదాలు సంభవించే అవకాశముంది. మీ ఇంట్లో వివాహితుడైన అబ్బాయి, అమ్మాయి గురించి చర్చ జరగవచ్చు. మీరు మీ అదృష్టాన్ని విశ్వసించండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. రాత్రి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రవర్తనకు సంబంధించి అన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టులపై పని ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేటు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. చిక్కుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నంది పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు జీవనోపాధిలో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలాకాలంగా ఆలోచిస్తున్న పనిలో మీరు విజయం పొందవచ్చు. రోజంతా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. అందువల్ల క్రియాత్మకంగా ఉండండి. కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు తీసుకురాగలిగితే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. పనిలో కొత్త జీవితం ఉంటుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు మీరు కొంచె జాగ్రత్తగా ఉండాలి. గ్రహయోగాల వల్ల మీరు కొంత నష్టపోయే అవకాశముంది. వ్యాపారంలో రిస్క్ తీసుకుంటే లాభాలు పొందుతారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. తన కోసం కొంత డబ్బు ఏర్పాటు చేసుకోవాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. లేకపోతే ఆర్థిక నష్టం కలిగే ప్రమాదముంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీరు రోజువారీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఈ రోజు నిజాయితీగా పనిచేయండి. నిర్దేశించిన నియమాలను జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బంది పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం భంగం కలిగించవచ్చు. మీకు చాలా సమస్యలను కలిగిస్తాయి. ఆహారంలో నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపార పరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆత్రుతలో పొరపాటు చేసే అవకాశముంది. కాబట్టి ప్రతి పని విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా సమయాన్ని గడుపాతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం వల్ల లాభంగా ఉంటుంది. సహనంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ తెలివితేటలను ఉపయోగించి పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. బాధలో ఉన్నవారికి సహాయం చేయగలిగితే శుభప్రదంగా ఉంటుంది. సానుకూల ఫలితాలు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.