ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 22 అక్టోబర్ 2020

By Arun Kumar P  |  First Published Oct 22, 2020, 7:11 AM IST

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

Latest Videos

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేటు వ్యాపారంలో ప్రయోజనం లభిస్తుంది. తండ్రి ఆశీర్వాద బలంతో ప్రభుత్వం గౌరవించే అవకాశముంటుంది. మీరు అందరికీ ఇష్టమైన వారు అవుతారు. తల్లి ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉండవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  కొంచెం కష్టంగా ఉంటుంది. ఇతరుల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి.  ఎలాంటి ఆందోళనలో పడకుండా ఉండండి. మీరు నిర్భయంగా మీ పనులను పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మాటలతో ఇతరులను బాధపెట్టకూడదు. ఓ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఎదుటి వ్యక్తి మీ గురించి చెడుగా చెప్పవచ్చు. మీరు అనుకున్నది మీరు పూర్తి చేయండి. తెలివితో తీసుకున్న నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోబుట్టువులతో మీకు కొన్ని విభేదాలు ఉంటాయి. కష్టపడి పనిచేసిన తర్వాత మీకు విజయం వరిస్తుంది. భౌతిక సౌకర్యాల కోసం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు తమ కుట్రల్లో విజయం సాధించలేరు. మీరు సంతోషంగా ఉన్నందున ప్రజలు మీతో బంధం గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు దాన గుణంలో మీ ఆత్మ మానసిక బలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ శరీరానికి ఎక్కువ తీరిక లేకుండా అలసిపోతారు. విశ్వాసం ఆధారంగా ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొంచెం ఖర్చు చేస్తే మీ పని పూర్తి అవుతుంది. కొత్త ప్రణాళికలతతో మీ పనులు  ప్రారంభమవుతాయి. మీ శక్తిని చూసి శత్రువులు నిరుత్సాహపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో రోగులకు ప్రయోజనం ఉంటుంది. శరీర నొప్పులు తొలగిపోతాయి. సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. స్నేహితుల నుంచి సంతోషంగా ఉంటారు. మీ మాటలను నియంత్రించుకోండి. మీ సామర్థ్యంతో చేసే ప్రతి చోటా విజయం సాధిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. నూతన పనులు నేర్చుకోవడంలో విజయవంతమవుతారు. మీరు మీ అభిప్రాయాన్ని నిరూపించుకోవాల్సిన సమయం రావచ్చు. తల్లిదండ్రులు, గురువు పట్ల విధేయత, భక్తి పెరుగుతుంది. మీరు వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదం జరగవచ్చు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పిల్లలు చేసిన పనులు మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ శత్రువులను జయించడంలో మీరు విజయం సాధిస్తారు. మీకిష్టమైన వారితో మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. పర్యటనల్లో సరదాగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు జ్ఞానం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్ధతు లభిస్తుంది. మీ పనులన్నీ పూర్తవుతాయి. మీ కృషి ద్వారా ప్రయత్నాలను నెరవేరుస్తారు. ప్రభుత్వం నుంచి మీరు ఎక్కువగా గౌరవించబడతారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సమయాన్ని గడుపుతారు. శుభకరమైన ఖర్చులు పెరుగుతాయి.ఆగిపోయిన డబ్బును నిలిపివేయవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. వారసత్వ ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. దేవుని పట్ల మీకున్న గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో మీ ఆనందం పెరుగుతుంది. ఎవ్వరికీ సలహా ఇవ్వవద్దు. మీకు ఎంతో ఖర్చును పెంచుతుంది. మంచి పనులు చేస్తే శుభఫలితాలు అందుకుంటారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఆదాయం పెంచడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉత్తమ మార్గాల ద్వారా అందుకున్న నిధులు పెరుగుతాయి. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీరు ప్రతి రంగంలోనూ ప్రయోజనాలను అందుకుంటారు. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు గ్రహాల శుభ పరిణామం వల్ల సంపద పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు అందుకుంటారు. సాయంత్రం సమయంలో ఇబ్బంది పడే అవకాశముంది. గురువు పట్ల మీ భక్తి, శ్రద్ధలతో ఉండండి. అనవసర ఖర్చులు నివారించండి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకి అనుకున్న పనులు విజయంవంతంగా పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!