ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 12 అక్టోబర్ 2020

By Arun Kumar P  |  First Published Oct 12, 2020, 7:17 AM IST

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...   


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

Latest Videos


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు పాత స్నేహితుల నుంచి మద్దతు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. రాత్రి సమయంలో ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. ప్రభుత్వం నుంచి గౌరవం పొందుతారు. రుణం తీసుకోవడం నివారించుకుంటే మంచిది. ఎందుకంటే ఆ రుణం తీర్చడం చాలా కష్టంగా ఉంటుంది.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పాదాలకు గాయమయ్యే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పని మార్పిడి చేయాలనుకుంటే బహిరంగంగా చేయండి. భవిష్యత్తులో మీరు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. శుభకార్యక్రమాలకు హజరయ్యే అవకాశముంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మిక పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. వ్యయానికి దూరంగా ఉండాలి. ఏదైనా శారీరక వ్యాధితో బాధపడుతుంటే ఈ రోజు బాధలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో అంతరాలు ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ కృషి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ బిడ్డపై విశ్వాసం బలంగా ఉంటుంది. తల్లి వైపు నుంచి ప్రేమ మద్దతు లభించే అవకాశముంది. మనం కీర్తి కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. శత్రువులను కలవరపెడుతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మానసిక క్షోభ, ఆందోళన, ఉదాసీనత కారణంగా తిరుగుతారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు అందుకుంటారు. చివరిలో ఉపశమనం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైపు నుంచి ఆగ్రహ సంకేతాలు కనిపిస్తాయి. కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే దానిలో మెరుగుదల కచ్చితంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు వ్యాపారంలో డబ్బు లాభం ఉంటుంది. నిర్భయంగా ఉంటుంది. కష్టమైన పనులను ధైర్యంగా చేయగలుగుతారు. తగిన మద్దతుతో తల్లిదండ్రుల ఆనందాన్ని పొందుతారు. శరీర నొప్పి కారణంగా జీవిత భాగస్వామికి కొంత ఇబ్బంది ఉండవచ్చు. ప్రజలు మీ బలవంతం లేదా స్వార్థంగా ఆలోచిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు శుభ ఫలితాలు అందుకుంటారు. ఆస్తి పెరుగుతుంది. ఇతరుల గురించి మంచి ఆలోచనలు చేస్తారు. హృదయపూర్వకంగా సేవలు చేస్తారు. అనుకూలంగా ఉంటుంది. మీరు గురువు పట్ల, పూర్తి భక్తి, విధేయతను కలిగి ఉంటారు.  మీరు నూతన పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీరు కొంచెం సేపు ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. మీరు  సహనంతో ప్రతిభతో శత్రు పక్షాన్ని జయిస్తారు. ఏదైనా చర్చ పెండింగ్ ఉంటే అందులో విజయం సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు జ్ఞానం పెరుగుతుంది. దాతృత్వం భావం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆచారాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు అదృష్టం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కడుపులో కొంత  ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. మీరు విలువైన వస్తువులను పొందవచ్చు. దీంతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా వస్తాయి. దగ్గరి బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. మీకు వ్యాపారంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పని సమయానికి పూర్తవుతుంది. ఏదైనా కొత్త పనిలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కచ్చితంగా చేయండి. భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు స్నేహితుడిని కలవడం ఆనందంగా ఉంటుంది. వివేకం, వివేచనతో నూతన ఆవిష్కరణలు చేయడానికి ఖర్చు అవుతుంది. అవసరమైన వాటికే ఖర్చు పెడతారు. మీరు మీ కుటుంబ సభ్యులకు నమ్మక ద్రోహం చేసే అవకాశముంది. ప్రయాణం చేసే అవకాశముంది. సానుకూల ఫలితాలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీకిష్టమైన వారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. సమజాంలో గౌరవం పెరుగుతుంది. ఫలితంగా ధైర్యంగా పెరుగుతుంది. బృహస్పతి కారణంగా పదవ ఇంట్లో ఉంటుంది. దీర్ఘకాల సంతానంకు సంబంధించి ఏదైనా వివాదం పరిష్కరించుకోగలుగుతారు. సంతోషకరమైన వ్యక్తిత్వం కావడంతో ఇతరులు మీతో సంబంధాన్ని కలిగి ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

click me!