ప్రముఖ జ్యోతిష్కుడు ఆచార్య ఈ రోజు రాశిపలాలను అందించారు. ఈ రోజు మీ జాతకఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.
వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు,
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151
గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు తక్కువ సమయంలోనే ఎక్కువ ఆనందం పొందుతారు. ఇతరుల సహాయం చేయడం ద్వారా లాభం పొందుతారు. మీరు ఎంచుకున్న రంగంలో ఆసక్తి ఉంటుంది. మిత్రులతో మీకు కొన్ని సమస్యలు ఉంటాయి. పనిపై దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఫలితంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఫలితంగా మీరు దాని ద్వారా ప్రయోజనం పొందుతారు. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఉంటుంది. అతిథి రాకతో ఆనందంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కొంత పని కారణంగా మీరు మరింత బిజీగా ఉంటారు. అనవసర ఖర్చు చేయకుండా ఉండండి. తండ్రి ఆశీర్వాదంతో ఏదైనా విలువైన వస్తువు లేదా ఆ్తస్తిని పొందాలనే కోరిక నెరవేరుతుంది. వాహనాన్ని వేగవంతం చేయకుండా ఉండండి. మీరు గొప్ప వ్యక్తిని కలవడం ద్వారా ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి అదృష్టం పొందుతారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విలువలు మీ ఖ్యాతిని పెంచుతాయి. త్వరితంగా మనోభావంతో తీసుకున్న నిర్ణయం తర్వాత పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. ధనలాభం ఉంటుంది. మీకు అదృష్టం మద్దతు ఇస్తుంది వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ రోజు మీకు ఉన్న కోరిక నెరవేరుతుంది. రాజకీయాల్లో ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. పిల్లల పట్ల బాధ్యత కూడా నెరవేరుతుంది. మీరు ఏదైనా పోటీలో పాల్గొంటే అందులో విజయం సాధించే అవకాశముంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రతిష్టాత్మక వ్యక్తుల కోసం ప్రత్యేకమైన రోజు అవుతుంది. జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. మీకిష్టమైనవారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆహారం, పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీరు ఎంచుకున్న రంగంలో అభినందనలు అందుకుంటారు. కుటుంబం నుంచి ఆనందం పొందుతారు. వీలైనంత వరకు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. గృహస్థుల సమస్య పరిష్కారమవుతుంది. ఆకస్మిక ప్రయోజనాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు దేశ పరిస్థితులు ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. విద్య, పోటీ రంగంలో ప్రత్యేక విజయాలు సాధించే అవకాశముంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీ మాటలతో ప్రత్యేక గరౌవం పొందుతారు. సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. అప్పుడు మీ మనసు మారుతుంది కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఇష్టానుసారం మంచి పని చేస్తారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. సంపద, గౌరవం, కీర్తి పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. మీకిష్టమైన వారిని కలుస్తారు. మీ గొంతును అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మీరు బాధపడాల్సి ఉంటుంది.గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు విషయాల్లో ఉపశమనం పొందుతారు. ఇందులో మీరు విజయం సాధిస్తారు. శత్రువులు నాశనమవుతారు. గృహ వినియోగాల కోసం ఖర్చు చేస్తారు. ప్రాపంచీక ఆనందం కోసం సాధనాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగానికి తగిన జీతం లభిస్తుంది. సహచరులు లేదా బంధువుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వ్యాపారంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు తప్పకుండా నిర్వహిస్తారు. మంచి వ్యాపార ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. వాహన వాడకంలో జాగ్రత్త వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. లాభం అందుకుంటారు. మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక శరీర నొప్పి కారణంగా ఎక్కువ ఖర్చులు అవుతాయి. ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయిచేటప్పుడు చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ రోజు స్వల్ప ప్రయాణాలు చేసే అవకాశముంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులపై భారం తక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ముఖ్యమైన సమాచారం వింటారు. ఫలితంగా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.