ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 19 సెప్టెంబర్ 2020

By telugu team  |  First Published Sep 19, 2020, 7:06 AM IST

ప్రముఖ జ్యోతిష్కుడు డా. యం.ఎన్ ఆచార్య మీ కోసం రాశి ఫలాలను అందిస్తున్నారు. మీ రాశిఫలం ఈ రోజు ఎలా ఉందో చూసుకోండి.


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

Latest Videos

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు విద్యార్థులు విజయవంతం కావడానికి ఎక్కువ జ్ఞానం పొందాలి. కుటుంబంతో నూతన ప్రణాళికల గురించి చర్చిస్తారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. దీన్ని సమతూల్యం చేసుకోవడం అవసరం. మీరు ఎంచుకున్న రంగంలో సహోద్యోగులు, అధికారులతో వాదనలు పెట్టుకోకండి ఇది హానిని కలగజేస్తుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు గృహస్థులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉంటుంది. తల్లి ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు వహించండి. సానుకూలంగా ఉంటుంది. ఓ సీనియర్ అధికారి సాయంతో సంక్లిష్టమైన పనిని పూర్తి చేయగలుగుతారు. ఇది మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీకు అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. తద్వారా వ్యాపారంలో మంచి సంపాదన సామర్థ్యం ఏర్పడుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు న్యాయపరమైన అంశాల్లో మీరు శుభవార్త అందుకుంటారు. కార్యాలయంలో మీరు నూతన ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇది మీ ప్రతిభను పెంచుతుంది. ఏదైనా సంక్లిష్టమైన పనిని సులభంగా పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ కారణంగా అధికారుల దృష్టి మీ వద్దకు వెళ్తుంది. ఇందువల్ల ప్రయోజనం ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వ్యాపారవేత్తలు ఉపాధికి సంబంధించిన వ్యక్తులు ఆహ్లాదకరమైన వార్తలను అందుకుంటారు. మీరు పరిశ్రమను నిర్వహిస్తుంటే ఉద్యోగుల కార్యకలపాలపై నిఘా ఉంచండి. తల్లిదండ్రులు సేవ చేయడానికి ఆశీర్వాదం పొందుతారు. బాధ్యతాయుతంగా పనిచేస్తారు. విద్యార్థులకు ఇది ఎంతో సానుకూల సమయం. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి విజయం సాధిస్తారు. శత్రువులు ఓడిపోతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు విజ్ఞానశాస్త్రానికి రంగానికి అనుబంధంగా ఉన్న ప్రజలకు నూతన అవకాశం లభిస్తుంది. వివాహ సంబంధిత విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం బలపడుతుంది. సోదరసోదరీమణుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు ఎంచుకున్న రంగంలో ఆధిపత్యం కొనసాగిస్తారు. అంతేకాకుండా విమర్శలు కూడా ఎదుర్కొంటారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామి అవసరాలను గుర్తుంచుకోండి. మాతృ పక్షంలో ఉన్నవారికి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలను నివారించండి. పనిలో మీకు వంద శాతం ఇస్తే మీకు గౌరవం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కలిసి వస్తుంది. కార్యాలయంలో ముఖ్యమైన పనిని మీకు అప్పగిస్తారు. ఫలితంగా మీకు ఆదాయం పెరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు కొంత వింతగా ఉంటుంది. రోజూవారీ పని చేయడానికి అవకాశముంటుంది. పనుల్లో అడ్డంకులు ఉంటాయి. వ్యాపారంలో పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అనంతరం మీరు ప్రయోజనం పొందుతారు. కుటుంబ సంపద కూడా పెరుగుతుంది. తండ్రి సహాయంతో కుటుంబంలో పరిస్థితి సాధారణం అవుతుంది. వ్యాపార సంబంధాలు బలపడతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు విద్యార్థుల అసంపూర్ణ లక్ష్యాలను నెరవేరేందుకు కనిపిస్తుంది. గురువుల ఆశీర్వాదం పొందుతారు. ప్రేమ జీవితానికి తగిన సమయముంటుంది. నూతన వ్యక్తుల పరిచయాల నుంచి భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. చాలా సార్లు మీరు సమస్యలు ఇరుక్కుంటారు. వాటి నుంచి బయటపడటానికి ఎంతో కష్టపడాలి. మీరు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు  మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ప్రయోజనం పొందుతారు. వ్యాపార వృద్ధిల్లో సోదరుల నుంచి సహకారం అందుకుంటారు. అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మార్గదర్శకత్వం నుంచి ప్రజలు ప్రయోజనం పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మీకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటారు. అలాగే విద్యార్థులు అనుభవజ్ఞులైన వ్యక్తిని కలుస్తారు. పిల్లవాడు చేసే ప్రతిదాన్ని మీరు అనుసరిస్తారు. ప్రేమ జీవితంలో నూతన అధ్యాయాన్ని జోడిస్తారు. సోదరసోదరీమణుల నిజాయితీ సంబంధాల్లో సామరస్యం ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు విద్యార్థులు అనుభవజ్ఞులైన వ్యక్తులను కలుస్తారు. దీని మార్గదర్శకత్వం భవిష్యత్తులో మీరు ప్రయోజనం అందుకుంటారు. సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆహ్లదకరమైన సమయం అవుతుంది. కుటుంబంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీరు ఆరోగ్యాన్ని పూర్తిగా జాగ్రత్తగా తీసుకోండి. వైరస్ కు దూరంగా ఉంటే మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫలితంగా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీకు జీవిత భాగస్వామి సలహా మీకు ఉపయోగపడుతుంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. ముఖ్యమైన పత్రాలను బయటకు తీసుకు రాకూడదు. వాటి గోప్యతను కాపాడుకోండి. పని పూర్తయ్యే వరకు ప్రణాళికను బహిరంగపరచవద్దు. బందువుల నుంచి సహకారం ఉంటుంది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న సమస్యలను అంతం చేస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!