Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఊహించని లాభాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.  ఈ దిన ఫలాలు 28.02.2025 వ తేదీ శుక్ర వారానికి సంబంధించినవి. 

Google News Follow Us

మేషం
ఉద్యోగులు అధికారుల కోపానికి గురికావాల్సి వస్తుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. దూర  ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు మానసికంగా బాధిస్తాయి.


వృషభం
బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి  ధన సహాయం అందుతుంది. కొలీగ్స్ తో మాటపట్టింపులు తొలగుతాయి.   నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.


మిథునం
వ్యాపారాల్లో ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు.

కర్కాటకం
ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన సమస్యలు తొలిగిపోతాయి. పిల్లల వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలు తీరుతాయి.

సింహం
అన్నదమ్ములతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన  కార్యక్రమాలు  సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపార విషయాల్లో భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాల్లో  శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

కన్య
పిల్లల విద్యా విషయాల్లో  శుభవార్తలు అందుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు  సమసిపోతాయి. ఆర్ధిక సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

తుల
కొత్త వ్యాపారాలకు  శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాన అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ  సభ్యులతో వివాదాలు  రాజీ అవుతాయి. పెద్దలతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

వృశ్చికం
ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. చిన్నప్పటి ఫ్రెండ్స్ తో  కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు  అందుతాయి. చేపట్టిన పనుల్లో  విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఊహించని  ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి  సాధిస్తారు.

ధనస్సు
దూరపు బంధువులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపార విషయంలో నిర్లక్ష్యం చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగులకు  పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో  జాగ్రత్తగా ఉండాలి.

మకరం  
వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో  తొందరపాటు పనిచేయదు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్ధిక పరిస్థితి కాస్త అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త చదువులపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు  తీసుకోవడం మంచిది.

కుంభం  
నూతన వ్యాపారానికి సహాయం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు  పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరంలో ఉన్నవారి నుంచి మంచి సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.

మీనం
ఉద్యోగంలో  పురోగతి సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కలిసివస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా  పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు  పొందుతారు. స్నేహితులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.