ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 17 అక్టోబర్ 2020

By telugu team  |  First Published Oct 17, 2020, 7:00 AM IST

ప్రముఖ జ్యోతిష్కుడు చార్య మీ కోసం ఈ రోజు రాశిఫలాలను అందించారు. ఈ రోజు మీ జాతకాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

Latest Videos

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. కార్యాలయంలో పై అధికారులతో అభిప్రాయభేదాలు ఉండవచ్చు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీలో ఉన్న కొన్ని అంశాలను ఇతరులు ఇష్టపడతారు. మీకిష్టమైన వారితో కలిసి ఉంటారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యాపారంలో మీరు మరికొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే కార్యాలయంలో ఏవరితోనైనా వివాదాలు ఉండవచ్చు. సమాజంలో సంబంధాలు ప్రయోజనం పొందుతాయి. నూతన పథకానికి శ్రద్ధ చూపుతారు. ఆకస్మిక ప్రయోజనాలు ఉండవచ్చు. స్నేహితుల సాయంతో పెట్టుబడిలో లాభం పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. స్నేహితులు, బంధువులు సమయం గడుపుతారు. మీరు సంతానం నుంచి బాధ పడవచ్చు. మీరు కలత చెందాల్సిన వస్తుంది. తక్కువ సమయంలోనే అంతా సరైందే అవుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మీకు ఇంటా బయటా కలిసి వస్తుంది. ఫలితంగా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో విజయం సాధిస్తారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిలో అదృష్టం కలిసి వస్తుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు శత్రువులు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారు, అయితే వారికి విజయం లభించదు. అనవసరమైన ఆందోళనలు మనస్సును కలవరపెడతాయి. విజయాల నుంచి ప్రయోజనం పొందుతారు. సామాజిక బాధ్యత కూడా కూడా పెరుగుతుంది. తెలియని వ్యక్తితో నష్టపోయే అవకాశముంది. డబ్బు తిరిగి అవకాశం పొందే ఉంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు కర్మ ద్వారా ప్రయోజనం పొందుతారు. బంధువుల నుంచి ఆనందం కలుగుతుంది. కుటుంబంతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. సృజనాత్మక లక్షణాల్లో మనస్సు ఆనందంగా ఉంటుంది. ఎవరితోనైనా గొడవ ఉంటే అప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. గృహస్థుల సమస్య పరిష్కారమవుతుంది. సూర్యస్తమయం సమయంలో ప్రయోజనం పొందుతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీ కోరికలు నెరవేరుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మనసులో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. సమస్య పరిష్కారం కోసం మనస్సులో కలవరం మొదలవుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు వచ్చినా చివరకు అనుకున్నది పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీకు గందరగోళంగా ఉంటుంది. మనస్సులో చాలా భయంగా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు ఓ సారి ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా జాగ్రత్త అవసరం. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ మనస్సులో ఆనందం ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు అనుకున్న పని పూర్తిచేయడంలో మనస్సు ఆనందంగా ఉంటుంది. మీకిష్టమైన వారి నుంచి మద్దతు ఉంటుంది. విశ్వాసం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజువారీ పనుల్లో అజాగ్రత్త పనికిరాదు. గతంలో చేసిన పరిశోధనల వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభాలు పొందుతారు. సాయంత్రం సమయంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మీకు ఉన్నతాధికారులతో విభేదాలు వచ్చే అవకాశముంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. మీ పరాక్రమంతో శత్రువుల శక్తి విచ్ఛిన్నమవుతుంది. ఆకస్మికంగా అతిథులు వచ్చే అవకాశముంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది. మంచి వ్యక్తులను కలవడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరనుకున్న పని జరుగుతున్నందు వల్ల మనస్సులో ఆనందం ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు గ్రహాల ప్రభావంతో కుంభం రాశివారికి సానుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఫలితంగా మానసిక సంతోషాన్ని పొందుతారు. వాహనాలు, భూమిని కొనుగోలు చేసే అవకాశముంది. ప్రాపంచీక ఆనందాలు పొందుతారు. గృహ వినియోగం కోసం కొనుగోలు చేయొచ్చు. ఆకస్మిక అతిథులు వచ్చే అవకాశముంది. ఫలితంగా సంతోషంగా ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు పూర్తిగా అదృష్టం కలిసి వస్తుంది. ఫలితంగా ఎంతో సంతోషంగా ఉంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. పిల్లలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఖర్చు చేస్తారు. ఏ పోటీలోనైనా గెలిచే అవకాశముంది. ప్రత్యేకమైన సాధనతో మనస్సు సంతోషంగా ఉంటుంది. వాతావరణ మార్పు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!